No Mammootty films were submitted for National Awards: సినిమా పరిశ్రమలో జాతీయ సినిమా అవార్డులను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా 300లకు పైగా సినిమాలు పోటీ పడ్డాయి. అయితే, ఈ అవార్డుల కోసం మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టికి సంబంధించి ఒక్క సినిమా లేకపోవడం విశేషం. అసలు ఈ అవార్డులను ఆయన ఎందుకో లైట్ తీసుకున్నట్లు అర్థం అవుతోందని జాతీయ అవార్డుల జ్యూరీ మెంబర్, ప్రముఖ దర్శకుడు ఎమ్ బీ పద్మకుమార్ వెల్లడించారు. నిజానికి మమ్ముట్టి 2022 నుంచి గత సంవత్సరం వరకు సుమారు 9 సినిమాల్లో నటించారు. వీటిలో ఒక్క సినిమాను కూడ జాతీయ అవార్డుల కోసం  పంపకపోవడం విశేషం.


జాతీయ అవార్డుల కోసం ఒక్క సినిమా పంపలేదు- పద్మకుమార్


జాతీయ సినిమా అవార్డుల కోసం మమ్ముట్టి నటించిన ఒక్క సినిమాను కూడా పంపలేదని జాతీయ అవార్డు జ్యూరీ సభ్యుడు పద్మకుమార్‌ తెలిపారు. అవార్డుల ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. “మమ్ముట్టి నటించిన ఒక్క సినిమాను కూడా అవార్డుల కోసం పంపించలేదు. ప్రేక్షకుల ఆయన సినిమాలను పరిగణలోకి తీసుకోలేదని తప్పుబడుతున్నారు. అసలు ఆయన ఎందుకు జాతీయ అవార్డుల కోసం తన సినిమాలను పంపించలేదో అర్థం కావట్లేదు. మమ్ముట్టి చాలా సినిమాల్లో అద్భుతంగా నటించారు. అయినా, ఆయన తన సినిమాలను జాతీయ అవార్డుల కోసం పంపిచకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి ఇది ఆయన చేసిన తప్పుగా భావిస్తున్నాం” అని పద్మ కుమార్ వెల్లడించారు. 


మమ్ముట్టి పొరపాటు మలయాళీ చిత్ర పరిశ్రమకు పెద్ద లోటు- పద్మకుమార్


మమ్ముట్టి తన సినిమాలను జాతీయ అవార్డుల కోసం పంపించకపోవడం, ఆయనకు మాత్రమే కాదు, మలయాళీ సినిమా పరిశ్రమకే తీరనిలోటుగా పద్మకుమార్ అభిప్రాయపడ్డారు. “ఆయన నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. 2022లో విడుదలైన పలు సినిమాల్లో ఆయన మంచి ప్రతిభ కనబర్చారు. అయినా, ఆయన ఎందుకో తన సినిమాలను పోటీకి పంపిచలేదు. ఆయన నిర్ణయం, మమ్ముట్టికి మాత్రమే కాదు, మయాళీ సినిమా పరిశ్రమకే తీరనిలోటు. ఆయన నిర్ణయం సరికాదని నేను భావిస్తున్నాను” అని ఆయన చెప్పుకొచ్చారు.  


ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి ఉత్తమ నటిగా నిత్యా మీనన్


70వ జాతీయ చలనచిత్ర అవార్డులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మలయాళీ మూవీ ‘ఆట్టమ్’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘కాంతార’ నటుడు రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. అటు ‘తిరుచిత్రాంబళమ్’ సినిమాలో నటననకు గాను నిత్యా మీనన్ జాతీయ ఉత్తమ నటిగా సెలెక్ట్ అయ్యారు. ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యింది.  


Read Also: నిర్మాతల చుట్టూ తిరిగిన రిషబ్... ఎయిర్ పోర్టులోనూ రిక్వెస్టులు... 'కాంతార' తెర వెనుక కహాని!



Read Also: ఓటీటీలు కన్నడ సినిమాలు కొనవు, తప్పక యూట్యూబ్‌లో పెడుతున్నాం - రిషబ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు