నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రావు రమేష్ (Rao Ramesh) తన వెర్సటాలిటీని ఎన్నో సినిమాల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. సీరియస్ రోల్స్ చేశారు. కామెడీ కూడా అంతే అద్భుతంగా పండించారు. విలక్షణ పాత్రలు పోషించారు. ఆయన తొలిసారి కథానాయకుడిగా నటించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' (Maruthi Nagar Subramanyam Movie). ఆగస్టు 23న (శుక్రవారం) థియేటర్లలో విడుదల అయ్యింది. విడుదలకు ముందు సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ అయ్యింది.


జీ టీవీకి మారుతి నగర్... మంచి రేటుకు!
Maruthi Nagar Subramanyam Satellite Partner: 'మారుతి నగర్ సుబ్రమణ్యం' శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థ జీ తీసుకుంది. ఓటీటీ మార్కెట్ పెరిగిన తర్వాత... డిజిటల్ మీడియా వేదికల్లో సినిమాలు చూడటానికి ఎక్కువ మంది జనాలు ఆసక్తి కనబరుస్తున్న ఈ తరుణంలో 'మారుతి నగర్ సుబ్రమణ్యం' టీవీ (శాటిలైట్) హక్కులు సినిమా విడుదలకు ముందు అమ్ముడు కావడం విశేషం.  అదీ మంచి రేటుకు ఇచ్చారని తెలిసింది. అయితే, ఇంకా ఓటీటీ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు. సినిమా విడుదల తర్వాత అమ్మాలని చూస్తున్నారు.


Also Readఆహా ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ హారర్ మూవీస్ ఇవే... వీటిని అస్సలు మిస్ కావొద్దు






కామెడీతో కొట్టిన రావు రమేష్... నవ్వులు గ్యారంటీ!
'మారుతి నగర్ సుబ్రమణ్యం' విడుదల శుక్రవారం అయితే ఒక్క రోజు ముందు... గురువారం రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు. సినిమాలో రావు రమేష్ నటనకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ఆయన పాత్రకు రాసిన డైలాగులు, సుబ్రమణ్యం కుమారుడిగా నటించిన అంకిత్ కొయ్యకు, ఆయనకు మధ్య సీన్లు వర్కవుట్ అయ్యాయి. చివరలో సెంటిమెంట్ టచ్ ఇచ్చారు. ఆ సెంటిమెంట్ కంటే ఎక్కువగా కామెడీ వర్కవుట్ అయ్యింది. రావు రమేష్ నటన విశ్వరూపం అని విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు.



'మారుతి నగర్ సుబ్రమణ్యం' చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఇది ఆయన రెండో సినిమా. ఓ విధంగా విడుదలకు ముందు ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సినిమా చూసి లక్ష్మణ్ కార్యను అప్రిషియేట్ చేశారు. సుకుమార్ భార్య తబితకు సినిమా నచ్చడంతో ఆవిడ తన సమర్పణలో విడుదల చేశారు. సినిమాలో వినోదం గురించి ఆవిడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఆ కామెడీకి మంచి పేరు వచ్చింది. కళ్యాణ్ నాయక్ పాటలు సైతం పేరు తెచ్చుకున్నాయి. వసూళ్ల వేటలో సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.


Also Read: ఓటీటీలోకి వచ్చిన ధనుష్ యాక్షన్ డ్రామా 'రాయన్' - ఆర్ అంటే రివేంజ్, ఓ రేంజ్‌లో ఉంటుంది మరి!