Jagadhatri Serial Today Episode: పరంధామయ్య అరుపు విని బయటకు వెళ్తుంది కౌషికి. అక్కడ ఆయనను ఎవరో పొడిచేసి ఉంటారు. రక్తపుమడుగులో గిలాగిలా కొట్టుకుంటుంటాడు పరంధామయ్య. దీంతో భయంతో పరుగెత్తుకెళ్లిన కౌషికి అయన పక్కన కూర్చుని ఏడుస్తూ అందరినీ పిలుస్తుంది. పరంధామయ్య బాధపడుతూనే కౌషికి సారీ చెప్తాడు. అమ్మా నొప్పి వస్తుంది. కత్తి తీసేయమ్మా అంటాడు. దీంతో కౌషికి కత్తి తీస్తుంది. అప్పుడే అందరూ ఇంట్లోంచి బయటకు వచ్చి చూస్తారు. సురేష్ పరుగెత్తుకొచ్చి పరంధామయ్య పక్కనే కూర్చుంటాడు. అంబులెన్స్ కు ఫోన్ చేయ్ సురేష్ అంటే నాన్న చనిపోయాడు అంటూ సురేష్ ఏడుస్తాడు.
వైజయంతి: నిన్న నువ్వు చంపేస్తాను అంటే ఏదో మాట వరసకు అనుకున్నాను అమ్మీ. కానీ ఇలా నిజంగానే చంపేస్తావనుకోలేదు. ఏదో పెద్డొడు ఆవేశంలో నోరు జారి నాలుగు మాటలు అన్నాడే అనుకో.. దానికే పొడిచి చంపేస్తావా? మామా అంటే నాయనతో సమానం కదా అమ్మి.
కౌషికి: పిన్ని నేను చంపలేదు.. నేను వచ్చి చూసే సరికి ఆయన..
వైజయంతి: ఆయనంతట ఆయనే చనిపోయాడంటున్నావా?
ధాత్రి: అత్తయ్య గారు మీకేమైనా పిచ్చి పట్టిందా? వదిన ఉన్న పరిస్థితి ఏంటి అసలు మీరు మాట్లాడుతన్న మాటలేంటి?
కాచి: అయితే ఇప్పుడు అక్క మామయ్యగారిని చంపలేదంటావా? జగధాత్రి.
ధాత్రి: అవును ఆయనను చంపే అవసరం వదినకు లేదు.
అనగానే వైజయంతి నిన్న రాత్రి గొడవ జరిగింది నువ్వు విన్నావు కదా? అంటుంది. దీంతో కోపంలో చాలా అంటాం కానీ అదే చేస్తామా? అంటాడు కేదార్. దీంతో వైజయంతి, బూచి… కౌషికి ఆయన్ని పొడవడం మనందరం కళ్లారా చూశాము కదా అంటుంది. సైలెంటుగా ఆయన్ని చంపేసి వెళ్లిపోదామనుకుంటున్నావా? అంటూ వైజయంతి అంటుంది. జరిగింది అది కాదు. అంటూ కౌషికి జరిగింది చెప్తుంది. షష్టిపూర్తికి నిన్ను పిలిచి నా మొగుణ్ని నేను చంపుకున్నాను కదమ్మా.. అంటుంది ఆదిలక్ష్మీ. కౌషికి మాత్రం బోరున ఏడుస్తుంది. తర్వాత తెల్లవారుతుంది. పోలీసులు వచ్చి మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అని సురేష్‌ను అడుగుతారు. సురేష్ ఎవరి మీద లేదని చెప్తాడు.
నిషిక: ఎందుకు అన్నయ్యా అబద్దం చెప్తారు. జరిగింది జరిగినట్టు చెప్పండి.
ధాత్రి: నిషిక నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండు. జరిగిందేంటో మనకెవ్వరికీ తెలియదు.
వైజయంతి: పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగి ఎవరూ చూడలేదనుకుంటే ఎట్టాగమ్మి.
కేదార్: పిన్ని ఫ్లీజ్ పెద్దవారు. నిషికకు చెప్పాల్సింది పోయి మీరే ఇలా మాట్లాడితే బాగోదు.
వైజయంతి: ఇది మరీ బాగుందబ్బీ నిజం చెప్పడం కూడా తప్పంటే ఎట్టా..?
సురేష్: నిజం బయటపడ్డప్పుడు మీ వాదన తప్పని మీకే అర్థం అవుతుంది అత్తయ్యా. సార్ మాకు ఎవరి మీద అనుమానం లేదు. ఇన్విస్టిగేషన్ చేసి నేరస్థున్ని కనిపెట్టండి.
ధాత్రి: ఏం మాట్లాడుతున్నారు ఇన్ స్పెక్టర్ గారు.
అని ధాత్రి అడగ్గానే నిన్న కౌషికి గారు వాళ్ల మామయ్యను చంపేస్తానని చెప్పారట కదా? అని చెప్పగానే భలే పాయింట్ పట్టాడు. వదిన బాగా ఇరుక్కుంది అనుకుంటుంది నిషిక. తర్వాత పోలీస్ ఆదిలక్ష్మీ దగ్గరకు వెళ్లి మీకెవరిమీదైనా అనుమానం ఉందా? అని అడుగుతాడు. దీంతో ఆదిలక్ష్మీ కౌషికి మీద అనుమానంగా ఉంది అంటుంది. దీంతో పోలీసులు కౌషికిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తర్వాత వైజయంతి, కమలాకర్, నిషిక, యువరాజ్ అందరూ కలిసి కౌషికి బయటకు వచ్చేలోపే మనం ఇల్లు కంపెనీని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే యువరాజ్ మాత్రం కౌషికిని సపోర్టు చేస్తాడు. ఇంతలో బూచి వచ్చి కేదార్, ధాత్రి వదినకు బెయిల్ తీసుకురావడానికి వెళ్తున్నారు అని చెప్పగానే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: రాణి గారి మెడలో మూడు ముళ్లు వేసిన రాజా వారు... కిరణ్ అబ్బవరం పెళ్లి ఫోటోలు