Brahmamudi Serial Today Episode: కల్యాణ్ ధీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. ఇంతలో అప్పు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. రేపు ఇంట్లో జరిగే పూజలో ఎంత గొడవ జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నాను. తాతయ్య, నానమ్మ ఎంత కంట్రోల్ చేసిన మా అమ్మ, రుద్రాణి అత్తయ్య ఎంత పెంట పెంట చేస్తారోనని భయంగా ఉందంటాడు. అయితే వాళ్లు ఎన్ని మాటలు అన్నా నేను నోరు ఎత్తనని అప్పు భరోసా ఇస్తుంది. అయితే నువ్వు కంట్రోల్ గా ఉంటావనేది కూడా నాకు డౌటే అంటాడు కళ్యాణ్. తర్వాత పూజకు అన్ని రెడీ చేస్తుంది కావ్య. కావ్యను ఇందిరాదేవి, అపర్ణ మెచ్చుకుంటారు. మరోవైపు ధాన్యలక్ష్మీ, రుద్రాణి మాట్లాడుకుంటారు.
రుద్రాణి: చూశావా? ధాన్యలక్ష్మీ.. వాళ్లు కావ్యను ఎంతలా పొగుడుతున్నారో?
ధాన్యలక్ష్మీ: అవును ఇవాల వ్రతంలో ఏం జరుగుతుందో వాళ్లకు తెలియదు కదా రుద్రాణి. పాపం ఆ కావ్యను చూడు చెల్లెలికి జరగబోయే అవమానం తెలియక ఎంత హడావిడి చేస్తుందో..
రుద్రాణి: ఏమో ధాన్యలక్ష్మీ.. ఆ ముసలొళ్లిద్దరు కలిసి కల్యాణ్, అప్పులను శాశ్వతంగా ఇక్కడే ఉంచుతారేమోనని నాకు కంగారుగా ఉంది.
ధాన్యలక్ష్మీ: అంత దూరం వెళ్లనిస్తానా..? ఇవాళ ఆ అప్పు కోడలిగా పనికి రాదని నిరూపిస్తా. అవును ముత్తైదువులను పిలిచావా. అప్పు రాకముందే వాళ్లు ఇక్కడ ఉండాలి.
అని ధాన్యం చెప్పగానే ముత్తయిదువులు వస్తుంటారు. వాళ్లను చూసి వీళ్లను ఎవరు పిలిచారు. కేవలం ఇంట్లోనే వ్రతం అనుకున్నాం కదా అని అపర్ణ అంటుంది. ధాన్యలక్ష్మీ పిలిచి ఉంటుంది. వాయినాలు ఇచ్చి పంపిస్తాం. కంగారు పడకు అని ఇందిరాదేవి చెప్తుంది. ఇంతలో ఆటోలో కల్యాణ్, అప్పు వస్తారు. అది చూసి ఇంట్లో వాళ్లు సంతోషిస్తారు. అప్పు ప్యాంటు, షర్టులో వచ్చిందని ధాన్యలక్ష్మీ, రుద్రాణి, అలాగే రుద్రాణి వ్రతానికి తీసుకొచ్చిన ఆడవాళ్లు అప్పును అవమానిస్తారు. దీంతో కళ్యాణ్ అందరి మీద కోప్పడతాడు. తాతయ్య వాళ్లు పిలిచారని వచ్చాం అంతే కానీ మనస్ఫూర్తిగా రాలేదని... మా అమ్మ ఎప్పటికీ మారదు ఇంకోసారు మీ అందరికి రుజువు చేయాలనే వచ్చాను. పద అప్పు ఇక మనం వెళ్లిపోదాం కల్యాణ్, అప్పు వెళ్లిపోతుంటే కావ్య ఆగండి అంటుంది.
కావ్య: కొత్త కోడలు గౌరీ దేవితో సమానం, నట్టింట్లోకి అడుగు పెడితే మహాలక్ష్మీతో సమానం అంటారు. గుమ్మం నుంచి బయటకు పంపించడం ఇంటికే అరిష్టం కవిగారు. కోపాలు, తాపాలు, పట్టింపులు, వీటికంటే బంధాలే ముఖ్యం.
రుద్రాణి: కానీ, నీ చెల్లెలు పూజకు వచ్చినట్లు ఉందా?
స్వప్న: జబ్బ లేని జాకెట్ వేసుకుని అందరిముందు తిరిగే నువ్వు అంటున్నావా అత్త
కావ్య: కట్టుబట్టలతో బయటకెళ్లిన జంట పట్టుబట్టలతో రావాలని ఎలా అనుకుంటున్నారు. దానికున్నవి ఏవో అవి వేసుకుని వచ్చింది. కొత్త కోడలికి అమ్మమ్మ గారు చీరలు కొన్నారు. అవి కట్టుకుంటుంది అక్క నువ్వు వెళ్లి హారతి తీసుకురా..
అని చెప్పగానే స్వప్న హారతి తీసుకొస్తుంది. కొత్త జంటకు కావ్య హరతి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది. తర్వాత రుద్రాణి, ధాన్యలక్ష్మీ డిసపాయింట్ అవుతారు. గుమ్మం దగ్గరే దాన్ని అవమానించాలనుకుంటే ఇలా జరిగిందేంటని ఫీలవుతారు. ఇక ఇప్పటి నుంచి అడుగడుగునా ఆ అప్పును అవమానించి జీవితంలో ఇంట్లోకి రాకుండా చేస్తాను అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. నువ్వు ఏమైనా చేయ్ కానీ జీవితంలో కల్యాణ్ అప్పులు రాకపోతే చాలు అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు చీర కట్టుకోవాల్సిందే అని అప్పుకు నచ్చజెబుతుంది స్వప్న. ముగ్గురు అక్కాచెల్లెల మధ్య ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. తర్వాత కావ్య బయటకు వచ్చి ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.