తెలుగు ప్రేక్షకులకు అర్జున్ దాస్ (Arjun Das) తెలుసు. ఆయన గొంతుకూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. 'బుట్ట బొమ్మ'తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన అర్జున్ దాస్ హీరోగా తమిళంలో లెజెండరీ దర్శకుడు శంకర్ నిర్మించిన సినిమా 'బ్లడ్ అండ్ చాక్లెట్' (Blood And Chocolate Movie). గతంలో 'ప్రేమిస్తే', 'వైశాలి', 'షాపింగ్ మాల్' చిత్రాలనూ ఎస్ పిక్చర్స్ పతాకంపై శంకర్ నిర్మించారు. దాంతో 'బ్లడ్ అండ్ చాక్లెట్' మీద అంచనాలు ఏర్పడ్డాయి.
తెలుగులోనూ 'బ్లడ్ అండ్ చాక్లెట్' ట్రైలర్ విడుదల
సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'బ్లడ్ అండ్ చాక్లెట్'ను తెరకెక్కించారు. జాతీయ పురస్కార గ్రహీత వసంత బాలన్ దర్శకత్వం వహించారు. దుస్సారా విజయన్ హీరోయిన్. తెలుగులో ఎస్.ఆర్.డి.ఎస్ సంస్థ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ నాలుగు అద్భుతమైన పాటల్ని అందించారని చిత్ర బృందం పేర్కొంది. తమ సంస్థ ద్వారా సినిమాను విడుదల చేయడం సంతోషంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన దేవసాని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
బ్లడ్ అండ్ చాక్లెట్ & ప్రేమ కూడా!
సాధారణంగా బ్లడ్ అంటే మనకు వయొలెన్స్ గుర్తుకొస్తుంది కానీ ఈ సినిమా విషయానికి వస్తే... బ్లడ్ అండ్ చాక్లెట్ (Blood And Chocolate)తో పాటు ప్రేమ, అభిమానం కూడా అని దర్శకుడు వసంత బాలన్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''తెలుగులో ఎస్.ఆర్.డి.ఎస్ పతాకంపై డి. శ్రీనివాస్ రెడ్డి, సునీల్ కుమార్ 'బ్లడ్ అండ్ చాక్లెట్'ను విడుదల చేస్తున్నారు. 'ఖైదీ, మాస్టర్, విక్రమ్'తో అర్జున్ దాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన రోల్ శక్తివంతంగా ఉంటుంది. యాంగ్రీ యంగ్ మేన్‌గా అన్నీ భావోద్వేగాలను ఆయన అద్భుతంగా పండించారు. 'వెయిల్'తో జీవీ ప్రకాష్ గారిని నేను పరిచయం చేశాను. అప్పుడే గొప్ప సంగీత దర్శకుడు అవుతాడని అనిపించింది. అతను జాతీయ పురస్కారం గెలుచుకోవడంతో పాటు వంద సినిమాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు. ''అర్జున్ దాస్ గొప్ప వాయిస్‌తో అద్భుతంగా నటించారు. ఆయనకు తెలుగులో ఎవరు డబ్బింగ్ చెబుతారా? అని నేను ఆలోచిస్తుంటే... తెలుగులోనూ డబ్బింగ్ చెబుతానని ముందుకు రావడం చాలా హ్యాపీగా అనిపించింది'' అని మాటల రచయిత రాజశేఖర్ రెడ్డి చెప్పారు.
Also Read : హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా రెబల్ స్టార్... 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్
'బ్లడ్ అండ్ చాక్లెట్'కూ ఈ ప్రేమ కావాలి - అర్జున్ దాస్
అర్జున్ దాస్ మాట్లాడుతూ ''జాతీయ పురస్కార గ్రహీత వసంత బాలన్ గారితో పని చేయటం ఎప్పటికీ గుర్తుండే జ్ఞాపకం. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంత గానో ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమా విషయంలోనూ మీ ప్రేమ, అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. ''తమిళంలో డబ్బింగ్ చెప్పటానికి వెళ్లినప్పుడు తెలుగు డబ్బింగ్ వర్క్ కూడా అక్కడ జరుగుతోంది. 'నాతో ఎందుకు తెలుగు డబ్బింగ్ చెప్పించలేదు' అని అడిగి... వేరే వాళ్లతో చెప్పిస్తే, మళ్ళీ నేనే తెలుగులోనూ డబ్బింగ్ చెప్పాను'' అని వనితా విజయ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కూడా పాల్గొన్నారు.
Also Read : నిర్మాతగా 'బాహుబలి' సేతుపతి - ఈసారి కొత్త హీరో హీరోయిన్లతో!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial