AR Rahman Wins Hollywood Music In Media Award For 'The Goat Life': ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌‌ అభిమానులకి చిరు సంతోషం దక్కింది. ఏఆర్ రెహమాన్‌‌ మరో ఘనత సొంతం చేసుకున్నారు. మలయాళ స్టార్, 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'ఆడు జీవితం: ది గోట్ లైఫ్' సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌‌‌కి గాను AR రెహమాన్ హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా (HMMA) 2024 అవార్డును గెలుచుకున్నారు. అయితే విడాకుల విషయం అనౌన్స్ చేసిన తర్వాత AR రెహమాన్‌కి ఇది మొదటి అవార్డు. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవం నుంచి తేరుకోక ముందే... ఈ పురస్కారం దక్కడం అతని అభిమానులకు ఒక చిన్న సంతోషంగా మారింది.


ఈ అవార్డుపై ఏ ఆర్ రెహమాన్ కూడా అదే విధంగా స్పందించారు. ఓ వీడియో ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనిని 'ఇన్క్రెడిబుల్ హానర్'‌గా ఆయన వర్ణించారు. దీని కోసం చిత్ర  యూనిట్‌కి, తన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన పనిని గుర్తించినందుకు HMMAకి  కృతజ్ఞతలు  తెలియజేశారు. అయితే ఈ అవార్డును అందుకునే కార్యక్రమానికి రెహమాన్ హాజరు కాలేదు.అతని తరపున దర్శకుడు బ్లెస్సీ అవార్డును స్వీకరించారు.






ఇటీవలె ఏఆర్ రెహమాన్, అతని భార్య సైరాబానుతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. 29 ఏళ్ల  వైవాహిక జీవితం తర్వాత రెహమాన్, సైరాబానులు విడిపోవడం అభిమానుల్లో కలవరాన్ని నింపింది. అయితే కుటుంబ జీవితంలో ఉన్న నొప్పి, వేదనతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఏఆర్ రెహమాన భార్య సైరా చెప్పారు. ఈ విషయంలో అభిమానులు, ప్రజలు తనను అర్థం చేసుకోవాలని కూడా ఆమె అభ్యర్థించారు. 


Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?


ఏఆర్ రెహమాన్‌కి, సైరాకు 1995లో పెళ్లి  జరిగింది. పెద్దల నిర్ణయంతో ఇరువురి వివాహం జరిగింది. ఒక సందర్భంలో రెహమాన్ ఈ విషయాన్ని తెలియజేశారు. తనకు పెళ్లి కూతురును వెదుక్కోవడానికి టై‌మ్ లేకోవడంతో పెద్దల కుదిర్చిన పెళ్లినే చేసుకున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏ ఆర్ రెహమాన్ తెలుగులో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కడప దర్గాకి వెళ్లడం, అది కూడా రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసం వెళ్లానని చెప్పడంతో ఇక్కడ ఎక్కువగా వైరల్ అయ్యాడు. ఏ ఆర్ రెహమాన్ మీద కూడా ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్టుకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.


Also Read: 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?