SJ Suryah Tweet On Game Changer : రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్‘ ఎలా ఉండబోతోంది? ఇది ఆయన ఫ్యాన్స్ ను ఎన్నాళ్ల నుంచో వెంటాడుతోన్న ప్రశ్న. ఫస్ట్ లుక్ నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ వరకూ అన్నీ అభిమానుల అంచనాలను పెంచాయి. జనవరి 10వ తేదీన సినిమా రిలీజ్ కానుంది. మరి అప్పటి వరకూ ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారా? సోషల్ మీడియాలో ఎవరి తోచిన స్టోరీలు రాస్తున్నారు. టీజర్ను బ్రేక్ డౌన్ చేస్తూ థియరీలు రాసుకుంటున్నారు. అయితే వారి అంచనాలను మరింత పెంచుతూ.. ఎస్.జె. సూర్య గేమ్ ఛేంజర్ రివ్యూ ఇచ్చేశారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఎస్.జె సూర్య ఒక అడుగు ముందుకు వేసి ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ అండ్ సెన్సేషన్గా మారింది.
పోతారు... మొత్తం పోతారు
సంక్రాంతికి రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన ఎస్.జె సూర్య తన పాత్రకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పారు. ఆ ఎక్స్టైట్ మెంట్ ను ఫ్యాన్స్ తో ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. ‘‘రామ్ చరణ్, శ్రీకాంత్ లతో నటించిన రెండు కీలకమైన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పాను. నాకైతే మూడు రోజులు పట్టేసింది. దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. థియేటర్లలో ఈ సన్నివేశాలకు పిచ్చి పిచ్చిగా అప్లాజ్ వస్తుంది. పోతారు. మొత్తం పోతారు ’’ అంటూ సరిపోదా శనివారం’ చిత్రంలోని తన హిట్ డైలాగ్ తో ఫ్యాన్స్ కు కిక్ ఎక్కించారు. ‘‘ఇంత మంచి అవకాశం ఇచ్చిన ‘దిల్’ రాజు గారికి నా ధన్యవాదాలు. ఆయన టీమ్ కి ఇది RAM’PING SHANKAR’ANTHI’’ అని ‘గేమ్ ఛేంజర్’ టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఒక్క ట్వీట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే
త్వరలోనే మూడో పాట
టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. త్వరలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను కాకినాడలో చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తున్నారన్న ప్రచారమూ షురూ అయింది. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తుంది. అంజలి, శ్రీకాంత్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ‘రా మచ్చా... రా మచ్చా అనే యూత్ ఫుల్ సాంగ్ తో పాటు ‘జరగండి...జరగండి’ అనే సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. త్వరలోనే మూడో పాటను విడుదల చేయనున్నారు. ఇంకా 50 రోజుల్లో సినిమా విడుదల అంటూ దర్శకుడు శంకర్ కౌంట్ డౌన్ షురూ చేస్తూ పోస్టర్ కూడా వదిలారు.
Also Read: 'మెకానిక్ రాకీ' ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ వరస్ట్... సెకండాఫ్ సూపర్ - మరి విశ్వక్ సేన్ హిట్ కొడతాడా?