Just In





Mechanic Rocky Twitter Review - 'మెకానిక్ రాకీ' ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ వరస్ట్... సెకండాఫ్ సూపర్ - మరి విశ్వక్ సేన్ హిట్ కొడతాడా?
Mechanic Rocky Twitter Review in Telugu: విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'మెకానిక్ రాకీ' పెయిడ్ ప్రీమియర్లు గురువారం రాత్రి పడ్డాయి. మరి, ఈ సినిమా సోషల్ మీడియా టాక్ ఏంటి? ఎలా ఉంది? అనేది చూస్తే...

Vishwak Sen, Meenakshi Chaudhary's Mechanic Rocky Movie Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'కి మంచి బజ్ వచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో ఇంత సౌండ్ చేసిన సినిమా మరొకటి లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రివ్యూల్లో పర్సనల్ ఎటాక్ చేస్తే వీపు పగులుతుందని వార్నింగ్ కూడా ఇచ్చారు హీరో విశ్వక్ సేన్. శుక్రవారం (నవంబర్ 22న) విడుదల అవుతున్న ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు గురువారం రాత్రి వేశారు. మరి, సినిమా టాక్ ఏంటి? విశ్వక్ సేన్ హిట్టు కొట్టాడా? 'లక్కీ భాస్కర్' హిట్ తర్వాత 'మట్కా'తో డిజాస్టర్ అందుకున్న మీనాక్షి చౌదరి లక్ మళ్ళీ ఈ మూవీతో మారుతుందా? సోషల్ మీడియాలో సినిమా టాక్ ఏంటి? అనేది ఒక్కసారి చూడండి.
ఫస్టాఫ్ బాలేదు కానీ... సెకండాఫ్ బావుంది!
'మెకానిక్ రాకీ' పెయిడ్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ అందరి నుంచి వినిపించిన మాట ఒక్కటే... ఫస్టాఫ్ కొంత వీక్ అని! ఇంకొందరు అయితే ఫస్టాఫ్ వరస్ట్ అని ట్వీట్ చేయగా... అటువంటి ట్వీట్లను ప్రొడక్షన్ హౌస్ ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ రీ ట్వీట్ చేయడం!
ఫస్టాఫ్ బాలేదని చెప్పిన ప్రతి ఒక్కరూ సెకండాఫ్ సూపర్ అని చెబుతున్నారు. మూవీ అసలు కథ అంతా రెండో భాగంలో ఉందని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత విశ్వక్ సేన్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని చెబుతున్నారు. పర్ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్ అని పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. 'మెకానిక్ రాకీ' పెయిడ్ ప్రీమియర్స్ చూసిన జనాలు చేసిన ట్వీట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి.
Also Read: 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఫస్ట్ రివ్యూ!
Mechanic Rocky First Review: ప్రతి సినిమాకూ మొదటి ప్రేక్షకుడు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక రీ రికార్డింగ్ చేసి సౌండ్ మిక్సింగ్ తర్వాత చూసేది వాళ్లే కదా! ఈ 'మెకానిక్ రాకీ'కి ఫస్ట్ రివ్యూ ఫస్ట్ ఆడియన్ నుంచి వచ్చింది.
'మెకానిక్ రాకీ' ఫైనల్ కాపీ రెడీ అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బియాజ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న రవితేజ ముళ్లపూడి పేరు చాలా రోజులు వినబడుతుందని పేర్కొన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ డైరెక్టర్ దొరికాడని చెప్పారు. అంతే కాదు... తనకు ఈ సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయని చెప్పారు. విశ్వక్ సేన్ ఫైర్ మీద ఉన్నాడని, అదే విధంగా మీనాక్షి చౌదరి అండ్ శ్రద్ధా శ్రీనాథ్ అని చెప్పారు. నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్‌టి ప్రొడక్షన్స్‌కు మంచి జరుగుతుందని,ఫన్ రైడ్ కోసం రెడీ అవ్వమని తెలిపారు.
పెయిడ్ ప్రీమియర్స్ అన్నీ హౌస్ ఫుల్!
'మెకానిక్ రాకీ' పెయిడ్ ప్రీమియర్స్ అన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. బెంగళూరులో ఎందుకు ప్రీమియర్స్ వేయడం లేదని ఒక అభిమాని సోషల్ మీడియాలో హీరోని అడిగాడు.
Also Read: బాలకృష్ణ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు... విలనా? ఇంపార్టెంట్ క్యారెక్టరా?
'మెకానిక్ రాకీ' కథ ఏమిటి? ట్రైలర్స్ ఎలా ఉన్నాయి?
కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి సివిల్ ఇంజనీర్ అవుతాయని చెప్పే కుర్రాడు రాకీ (విశ్వక్ సేన్). అతని మీద తండ్రి (సీనియర్ నరేష్)కు అసలు నమ్మకం ఉండదు. మా అబ్బాయి దేనికీ పనికి రాడని డైరెక్టుగా చెబుతాడు. చివరకు తండ్రి గ్యారేజీలో పని చేయడం మొదలు పెడతాడు. డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఇద్దరు అమ్మాయిల్లో ఎవరితో ప్రేమలో పడ్డాడు? అంకి రెడ్డి (సునీల్)తో ఎందుకు గొడవ వచ్చింది? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఆల్రెడీ విడుదలైన రెండు ట్రైలర్లకు రెస్పాన్స్ బావుంది.