ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ సాలిడ్ కమ్ బ్యాక్... ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన జీబ్రా... టాక్ ఎలా ఉందంటే?

ZEBRA Movie Twitter Review: సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా నటించిన 'జీబ్రా' శుక్రవారం విడుదల కానుంది. ముందు రోజు పెయిడ్ ప్రీమియర్లు వేశారు. ఈ సినిమాకు ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Continues below advertisement

Satyadev's ZEBRA Review In Telugu: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సత్యదేవ్ హీరోగా నటించిన తాజా సినిమా 'జీబ్రా'. ఇందులో కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరొక హీరో. శుక్రవారం (నవంబర్ 22న) థియేటర్లలో విడుదల అవుతోంది. అయితే, ముందు రోజు పెయిడ్ ప్రీమియర్లు వేశారు. మరి, సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? ట్విట్టర్ టాక్ ఎలా ఉంది? అనేది చూడండి. 

Continues below advertisement

సర్‌ప్రైజ్ చేసిన జీబ్రా...
అసలు ఊహించలేదు!
'జీబ్రా' పెయిడ్ ప్రీమియర్స్ జనాలు అందరూ బావుందని చెబుతున్నారు. అసలు ఊహించలేదని, సినిమా ఇంత మంచిగా ఉంటుందని అనుకోలేదని అంటున్నారు. బ్యాంకు మోసాల మీద తీసిన ఈ సినిమా ఇంత ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నెటిజన్స్ చెబుతున్నారు. థియేటర్లలో సినిమాను అస్సలు మిస్ కావద్దని అన్నారు. మరి, సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉందో చూడండి.

'జీబ్రా'... సత్య కమ్ బ్యాక్...
ఎగ్జైటింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్!
Zebra Marks Satyadev's Comeback: 'తిమ్మరుసు' తర్వాత సత్యదేవ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. 'జీబ్రా'తో ఆయన కమ్ బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఎగ్జైటింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ వైట్ కాలర్ క్రిమినల్ డ్రామా అని పేర్కొన్నారు.

సత్యదేవ్, ధనుంజయ ఇరగదీశారని... వాళ్లిద్దరూ తమ నటనతో ఆడియన్స్ మనసు దోచుకోవడం గ్యారంటీ అని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. కమెడియన్ సత్య, సత్యరాజ్, జెనీ మేజిక్ చేశారని తెలిపారు. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ చాలా తెలివిగా స్క్రిప్ట్, సీన్స్ రాశారట. రవి బస్రూర్ రీ రికార్డింగ్ కుమ్మేశారట. ఎడిటింగ్ గురించి కూడా నెటిజనులు చెబుతున్నారు.

Also Readక్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే

టెర్రిఫిక్ స్టోరీ... ఎక్సలెంట్ సినిమా
'జీబ్రా' స్టోరీ టెర్రిఫిక్ అని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు. ఇదొక ఎక్సలెంట్ సినిమా అని ఇంకొకరు పేర్కొన్నారు. టాప్ నాచ్ విజువల్స్, రాకింగ్ పెర్ఫార్మన్స్, గుడ్ ప్రొడక్షన్ వేల్యూస్... వెరసి సినిమా బావుందని ఇంకొకరు చెప్పారు.

Also Read: బాలకృష్ణ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు... విలనా? ఇంపార్టెంట్ క్యారెక్టరా?

ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా నటించిన 'జీబ్రా' చిత్రాన్ని ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. థియేటర్లలో ఈ సినిమాకు ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Continues below advertisement