మన జీవితం మన చేతి రేఖల్లోనే ఉంటుందని బలంగా నమ్మే వ్యక్తి సారంగపాణి. రోజూ పేపర్‌లో వచ్చే రాశి ఫలాలే తన భవిష్యత్తును నిర్ణయిస్తాయని గట్టిగా నమ్మతాడు. ఏదైనా ఆనందం వస్తే బయటకు నవ్వేస్తాడు. సమయం, సందర్భం ఉండదు. చుట్టూ ఎవరున్నారోనని ఆలోచించడు. ఆ సారంగపాణిని ఆడించే ఓ జ్యోతిష్యుడు కూడా ఉంటాడు. ఒకానొక దశలో సారంగపాణి వయలెంట్ అయిపోతాడు కూడా. తన పెళ్లిలోనే పెద్ద సీన్ చేసేస్తాడు. మరి, ఆ జాతకాల పిచ్చి వల్ల ఆ అమాయకుని జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో తెలియాలంటే ‘సారంగపాణి జాతకం’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి.


మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి జాతకం
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohan Krishna Indraganti) రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘సారంగపాణి జాతకం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) హీరో. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.  
ప్రియదర్శితో నే నా కెరీర్ మొదలైంది!
’’నేను, ప్రియదర్శి ఒకే సారి కెరీర్ ను మొదలుపెట్టాం. మంచి కథలున్న లీడ్ రోల్స్ చేసుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నాడు. డెస్టినీ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. సారంగపాణి జాతకం మించి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అంటూ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాలో ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రూప కొడవాయూర్ (Roopa Koduvayur) కథానాయిక. సీనియర్ నరేశ్, తనికెళ్ల భరణి, శివన్నారాయణ, ‘వెన్నెల’ కిషోర్, ‘వైవా’ హర్ష  తదితరులు నటించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ స్వరకర్త.






సారంగపాణి జీవితాన్ని మలుపు తిప్పే జ్యోతిష్యునిగా శ్రీనివాస్ అవసరాల చెప్పిన డైలాగ్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని నటించిన ‘జెంటిల్మెన్’, సుధీర్ బాబు హీరోగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రాల తర్వాత శ్రీదేవీ మూవీస్ సంస్థలో మోహనకృష్ణ ఇంద్రగంటికి ఇది మూడో సినిమా. ఈ చిత్రంలోని ‘సారంగో సారంగ’ అనే మెలోడీ సాంగ్ ను ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్. దానికి మంచి స్పందన లభిస్తోంది.


Also Read: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న క్రికెటర్ యోజేంద్ర చాహల్ భార్య - ఏ సినిమాలో నటిస్తుందో తెలుసా?



ప్రియదర్శి విషయానికి వస్తే ‘మల్లేశం’, ‘బలగం’ చిత్రాలతో తన కంటూ  హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ‘ఓం భీమ్ బుష్’, ‘డార్లింగ్’  ‘35  చిన్న కథలు’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. మరో వైపు స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఆయన నటించిన ‘సేవ్ ద టైగర్స్ ’ అనే వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల్ని నవ్వించింది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’లోనూ ప్రియదర్శి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా హీరో నాని నిర్మాణంలో రూపొందుతోన్న ఓ కోర్ట్ రూమ్ డ్రామా లో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు.


Also Readరెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?