Thala Movie Teaser: తెలుగు సినిమా పరిశ్రమలో అమ్మ రాజశేఖర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన కొడుకు రాగిన్ రాజ్ హీరోగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. తండ్రి రాజశేఖర్ దర్శకత్వంలోనే ‘తల’ అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.


మా అబ్బాయికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి- అమ్మ రాజశేఖర్


ఈ వేడుకలో మాట్లాడిని దర్శకుడు అమ్మ రాజశేఖర్, ‘తల’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. “మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు ఈ ‘తల’ సినిమా అంతే ఇంపార్టెంట్. నేను దేవుడిగా భావించేది ఆర్బీ చౌదరి గారిని. ఆయన నాకు డ్యాన్స్ మాస్టర్ గా ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఆయన సినిమాలతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన నిర్మాణంలోనే మా అబ్బాయి రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. మా అబ్బాయిని వారి అబ్బాయిలా భావించి ఈ అవకాశం ఇచ్చారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎమోషన్స్, ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. త్వరలో విడుదలకాబోతోంది. మా అబ్బాయికి మీ బ్లెస్సింగ్ ఇవ్వండి” అని కోరారు.


ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది- రాగిన్


ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని హీరో రాగిన్ రాజ్ చెప్పుకొచ్చారు. “నేను హీరోగా మారినప్పటి నుంచి ప్రేక్షకులే నాకు అన్నీ అనుకున్నాను. వాళ్లు ఎలా ఉండాలని కోరుకుంటారో అలా ఉంటాను. నాన్న ‘తల’ మూవీ కథ చెప్పినప్పుడు సినిమా, నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో మనసులో ఊహించుకున్నాను. ఇప్పు నేను నా క్యారెక్టర్ లోనే ఉండిపోయాను. ‘తల’ సినిమా తప్పకుండా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది” అన్నారు.



డిఫరెంట్ క్యారెక్టర్ చేశా- ఎస్తేర్


ఇక ఈ సినిమా తనకు మంచి ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిందని హీరోయిన్ ఎస్తేర్ అన్నారు. “ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇప్పటిదాకా నేను నటించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి రోల్ లో నన్ను తీసుకోవడమే సర్ ప్రైజ్ చేసింది. షూటింగ్ అంతా చాలా పాజిటివ్ వైబ్ తో సాగింది. సినిమా మంచి విజయం సాధిస్తుందని అప్పుడే అనిపించింది. మీరంతా థియేటర్స్ లో ఎంజాయ్ చేసేలా ‘తల’ సినిమా ఉంటుంది” అన్నారు.


ఇక ‘తల’ సినిమా ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి  సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకం మీద తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి ఎన్ వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  అమ్మ రాగిన్ రాజ్, రోహిత్,  ఎస్తేర్, ముక్కు అవినాష్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రావణ్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Also Readక్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే