Allu Arjun Daughter Arha Age: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ గురించి తెలుగు ప్రేక్షకులకు, ఆ మాటకు వస్తే పాన్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బన్నీ కుమార్తెగా మాత్రమే కాదు... బాల నటిగాను అర్హ అందరికీ తెలుసు. ఈరోజు అమ్మాయి పుట్టిన రోజు. 


నా జీవితంలో క్యూటెస్ట్ జాయ్!
అల్లు అర్జున్, స్నేహ దంపతులకు ఇద్దరు పిల్లలు. మొదట అబ్బాయి పుట్టాడు. అల్లు వారి అబ్బాయి పేరు అయాన్. అప్పుడప్పుడు సినిమా వేడుకల్లో కనిపిస్తూ ఉంటాడు. అమ్మాయి అర్హ చిన్నది. ఆమె సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' సినిమాలో నటించింది. నవంబర్ 21... ఈరోజు అర్హ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.


తన జీవితంలో క్యూటెస్ట్ జాయ్, తన చిన్నారి అర్హకు హ్యాపీ బర్త్ డే అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. తన జీవితంలోకి అర్హ వచ్చిన తర్వాత జీవితం మరింత మధురంగా మారిందని ఆయన తెలిపారు. అర్హ మీద తనకు అంతులేని ప్రేమ ఉందని పేర్కొన్నారు. అప్పుడే ఎనిమిదేళ్ల నిండాయా అంటూ లక్ష్మీ మంచు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆవిడితో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అర్హకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.


Also Read: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?






అర్హ చాలా పాజిటివ్ బేబీ!
అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నా స్వీటెస్ట్, క్యూటెస్ట్ హ్యాపీ బర్త్ డే అని ఆవిడ పేర్కొన్నారు. అర్హ చాలా పాజిటివ్ బేబీ అని స్నేహ పోస్టును బట్టి అర్థమవుతుంది. అర్హ అంటే తనకు ఎంతో ప్రేమ అని చెప్పారు. 


Also Read: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?






అలవోకగా తెలుగు పద్యం చెప్పిన అర్హ అల్లు అర్జున్ అతిథిగా హాజరైన 'అన్ స్టాపబుల్' లేటెస్ట్ ఎపిసోడ్ ఇటీవల స్ట్రీమింగ్ అయింది. అయితే అది పార్ట్ వన్ మాత్రమే. ఎపిసోడ్ లో బన్నీతో పాటు ఆయన తల్లి కూడా హాజరు అయ్యారు. పార్ట్ 2 త్వరలో ఈ శుక్రవారం (నవంబర్ 22న) స్ట్రీమింగ్ కానుంది. దానికి అల్లు అర్జున్ పిల్లలు ఇద్దరు వచ్చారు. అలవోకగా అర్హ చెప్పిన తెలుగు పద్యం చూసి నట సింహం నందమూరి బాలకృష్ణ ఎంతో మురిసిపోయారు. ఆ చిన్నారికి ఆత్మీయంగా ముద్దు పెట్టి తెలుగు నాలుగు కాలాల పాటు చల్లగా, హాయిగా బ్రతుకుతుందని అనిపిస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.