ఏయ్ బిడ్డా... ఇది పుష్ప రాజ్ అడ్డా అన్నట్టు ఆదివారం బీహార్ రాజధాని పాట్నా అంతటా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హంగామా నడిచింది. భారీ ఎత్తున బిహారీ ప్రజల సమక్షంలో 'పుష్ప 2' సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇదే గ్రూపులో చెన్నై కొచ్చి నగరాల్లో ఈవెంట్స్ చేయడానికి మూవీ టీం రెడీ అయింది.
చెన్నైలో ఒకరోజు కొచ్చిలో మరో రోజు...
ఆ రెండు రోజుల్లో అక్కడ పుష్పరాజ్ రూల్!
'పుష్ప 2' విడుదలకు పట్టుమని 15 రోజులు కూడా లేదు. అందువల్ల, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేత సుడిగాలి పర్యటనలు చేయించేలా మూవీ టీం ప్లాన్ చేసింది.
నవంబర్ 24వ తేదీన తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసేది 'పుష్ప 2' టీం. అక్కడ సందడి ముగిసిన మూడు రోజులకు నవంబర్ 27న కేరళలోని కొచ్చిలో మరో ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఎప్పుడు చేస్తారు?
పాట్నాలో 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ చేశారు. తమిళనాడు, కేరళలో కూడా ఈవెంట్స్ చేయడానికి ప్లాన్ చేశారు. మరి అల్లు అర్జున్ అడ్డా, హోమ్ గ్రౌండ్ లాంటి తెలుగు రాష్ట్రాలలో ఈవెంట్ ఎప్పుడు చేస్తారు? ఈ ప్రశ్న అల్లు అర్జున్ ఆర్మీతో పాటు సామాన్య ప్రేక్షకులు చాలా మందిలో ఉంది. నవంబర్ నెలాఖరున లేదంటే డిసెంబర్ 1, 2వ తేదీలలో ఏపీ లేదా తెలంగాణలో భారీ ఈవెంట్ చేయడానికి పుష్ప 2 సినిమా టీం లాంచ్ చేస్తుందని తెలిసింది.
ట్రైలర్ రెస్పాన్స్ అదిరింది పుష్పరాజ్!
'పార్టీ లేదా పుష్ప' అంటూ మొదటి భాగంలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయింది. సీక్వెల్ వచ్చేసరికి ఆయన డైలాగ్ మారింది. 'పార్టీ ఉంది పుష్ప' అంటూ భారీ యాక్షన్ సీక్వెన్సులకు తెర తీశారు. ఆదివారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ రికార్డులు క్రియేట్ చేస్తుంది. 24 గంటలలో అత్యధిక వ్యూస్ అందుకున్న సినిమాగా చరిత్రకు ఎక్కింది. ఒక్క రోజులో ఈ సినిమా ట్రైలర్ 44.67 మిలియన్ వ్యూస్ అందుకుంది. వన్ మిలియన్ లైక్స్ అందుకోవడంలో ఈ సినిమా కాస్త వెనుకబడింది. ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ అందుకున్న తెలుగు సినిమా ట్రైలర్లలో ఆరో స్థానంలో నిలిచింది.
Also Read: ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసింది. మొదటి భాగంతో పోలిస్తే ఇందులో ఆయన నట విశ్వరూపం చూస్తారని ఫహాద్ భార్య, మలయాళ కథానాయిక నజ్రియా నజీమ్ పేర్కొంది. జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, డాలి ధనుంజయ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శ్రీ లీల ప్రత్యేక గీతం చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న అమెరికాతో సహా ఓవర్సీస్ మార్కెట్లలో, డిసెంబర్ 5న ఇండియాలో భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నారు.
Also Read: బన్నీ అండ్ సుక్కుతో దేవి... వాళ్ల మధ్య గొడవల్లేవ్, పుకార్లకు చెక్ పెట్టేలా చంద్రబోస్ ఫోటోలు