ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ జీనియస్ సుకుమార్, మ్యూజికల్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మధ్య సత్సంబంధాలు ఉన్నాయా లేవా? ఆ ముగ్గురి మధ్య గొడవ జరిగిందా? అందుకే నేపథ్య సంగీతం చేయడానికి తమన్ వచ్చారా? పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులలోనూ బోలెడు సందేహాలు! వీటన్నిటికీ చెక్ పెట్టేలా లిరిసిస్ట్ చంద్రబోస్ కొన్ని ఫోటోలు షేర్ చేశారు.
బన్నీ అండ్ సుక్కుతో దేవి!
'పుష్ప: ది రైజ్' సినిమాలో పాటలు అన్నిటిని చంద్రబోస్ రాశారు. ఆ సినిమా సీక్వెల్ 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2 The Rule)లో పాటలనూ ఆయనే రాశారు. సుకుమార్ సినిమా అంటే చంద్రబోస్ పాట కంపల్సరీ. అందులోనూ నేషనల్ వైడ్ భారీ హిట్ సాధించిన, ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట ఉన్న 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధరం' తర్వాత చంద్రబోస్ పాటలు రాసిన పాన్ ఇండియా సినిమా కావడంతో 'పుష్ప 2' సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
'పుష్ప 2' ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. అందులో ప్రతి ఫ్రేమ్ లో తన నేపథ్య సంగీతం ఉందని దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. 'పుష్ప 2' చిత్రానికి 15 రోజులలో నేపథ్య సంగీతం చేయలేమని, తన దగ్గరకు అవకాశం వచ్చినప్పుడు సవాలుగా తీసుకొని ఫస్ట్ హాఫ్ వరకు రీ రికార్డింగ్ చేశానని తమన్ చెప్పిన కొన్ని గంటలకు ట్రైలర్ విడుదల అయింది. దాంతో ట్రైలర్ వరకు ఎవరూ రీ రికార్డింగ్ చేసి ఉంటారు? ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ తమన్ చేస్తే దేవి శ్రీ ప్రసాద్ ఏం చేశారు? అని బోలెడు సందేహాలు తలెత్తాయి.
బన్నీ సుక్కులతో దేవి శ్రీకి పడడం లేదు అని, అందుకే మరొక సంగీత దర్శకుడు రీ రికార్డింగ్ చేయడానికి వచ్చారని గుసగుసలు చాలా వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెడుతూ... హీరోతో పాటు దర్శకుడు సంగీత దర్శకుడు నిర్మాతలతో కలసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో చంద్రబోస్ షేర్ చేశారు. అందులో అందరితో కలిసి నవ్వుతూ దేవి కనిపించారు. దాంతో వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు లేవని అనుకోవచ్చు.
Also Read: 'పుష్ప 2'లో ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపం చూస్తారు... భన్వర్ సింగ్ షెకావత్ రియల్ వైఫ్ ఏమందో తెలుసా?
డిసెంబర్ 5వ తేదీన తెలుగుతో పాటు హిందీ మలయాళ కన్నడ తమిళ బెంగాలీ భాషల్లో 'పుష్ప 2: ది రూల్' విడుదల అవుతుంది. అల్లు అర్జున్ జోడీగా శ్రీవల్లి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక నటించిన ఈ సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్, ఇంకా ఇతర కీలక పాత్రల్లో అనసూయ భరద్వాజ్, సునీల్, డాలి ధనుంజయ, తారక్ పొన్నప్ప తదితరులు నటించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని హిందీలో అనిల్ తడానీ విడుదల చేస్తున్నారు. అమెరికాలో డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు వేయడానికి ప్లాన్ చేశారు.
Also Read Pushpa 2 Trailer Launch Highlights - పాట్నా ప్రజల ప్రేమకు ఐకాన్ స్టార్ ఫిదా... బన్నీ స్పీచ్ to 2 లక్షల మంది జనాలు, పోలీస్ సెక్యూరిటీ - 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ హైలైట్స్