Naga Chaitanya Sobhita Dhulipala Wedding Invitation: టాలీవుడ్ యువసామ్రాట్ నాగ చైతన్య, శోభితా ధూళిపాళ‌లకు ఆగస్టులో నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దీని గురించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. నాగ చైతన్య, శోభిత పెళ్లి కార్డు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. దీంతో వీరు పెళ్లి చేసుకునే తేదీ కూడా బయటకు వచ్చింది. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.


నాగ చైతన్య-శోభిత పెళ్లి తేదీ ఖరారు!
నాగ చైతన్య, శోభిత పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పెళ్లి కార్డులో పేర్కొన్న దాని ప్రకారం డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగనుంది. నిజానికి శోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ జంట ఇప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని అభిమానులు ఉత్కంఠగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి తేదీ కూడా బయటకు రావడంతో ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది. డిసెంబర్‌లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.


పెళ్లి కార్డులతో పాటు బహుమతులు కూడా...
పెళ్లి కార్డుతో పాటు అతిథుల కోసం ప్రత్యేక బహుమతి బుట్టలను కూడా ఈ జంట సిద్ధం చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన వెదురు బుట్టలో పువ్వులు, ప్రింటెడ్ క్లాత్, ఫుడ్ ప్యాకెట్లు, కొన్ని చిన్న టోకెన్లు కూడా ఉన్నాయి. అయితే పెళ్లి వేడుక వివరాలు మాత్రం లీక్ అయిన శుభలేఖలో లేవు. 



Also Readవెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య


‘తండేల్‌’తో చైతన్య బిజీ...
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తండేల్’ సినిమాతో నాగచైతన్య బిజీగా ఉన్నారు. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏకంగా రూ.70 కోట్ల బడ్జెట్‌తో ‘తండేల్’ తెరకెక్కుతున్నట్లు సమాచారం. 2025 ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. నాగ చైతన్య సరసన సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ భారీ సక్సెస్‌ను అందుకుంది.


దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమాకు ఎడిటర్‌గా నేషనల్ అవార్డు అందుకున్న నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శామ్ దత్ సినిమాటోగ్రఫీలో ‘తండేల్’ తెరకెక్కుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. 



Read Also: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?