Nayanthara Beyond The Fairytale: నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్‌ల (Vignesh Shivan) పెళ్లికి సంబంధించిన రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుక్కున్న సంగతి తెలిసిందే. ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టెయిల్’ పేరుతో తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ నేటి నుంచి (నవంబర్ 18వ తేదీ) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ధనుష్, నయనతారలకు ఈ డాక్యుమెంటరీ సందర్భంగానే విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధనుష్‌కు నయన్ ఒక ఓపెన్ లెటర్ కూడా రాశారు.
ఆ లెటర్‌లో ఏం ఉంది?
నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమకు ధనుష్ నిర్మాణంలో తెరకెక్కిన ‘నానుమ్ రౌడీ దాన్’ సమయంలోనే బీజం పడింది. ఆ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు అస్సలు పరిచయం లేని వీరిద్దరూ షూటింగ్ అయిపోయే సమయానికి ప్రేమ పక్షులు అయిపోయారు. ఇలా వారి ప్రేమ కథలో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాకు చాలా పాత్ర ఉంది. తమ డాక్యుమెంటరీలో ఆ సినిమాకు సంబంధించిన క్లిప్స్, ఆడియో, ఆఖరికి లిరిక్స్ వాడటానికి ధనుష్ ఎన్‌వోసీ ఇవ్వనే లేదట. ట్రైలర్‌లో మూడు సెకన్ల షూటింగ్ క్లిప్స్ వాడినందుకు ఏకంగా రూ.10 కోట్ల ఫైన్ వేస్తూ లీగల్ నోటీసుల పంపాడట. ఈ విషయాలపై నయనతార ఆ లెటర్‌లో దుమ్మెత్తి పోశారు.
Also Read: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
ఎన్‌వోసీ కోసం ఏకంగా రెండేళ్ల పాటు ధనుష్ చుట్టూ తిరిగామని, అయినా అతను ఏమాత్రం స్పందించలేదని పేర్కొన్నారు. దీంతో చేసేది లేక ఆ సినిమాకు సంబంధించిన క్లిప్స్, మ్యూజిక్, ఆఖరికి లిరిక్స్ కూడా లేకుండా ఆ డాక్యుమెంటరీని విడుదల చేసినట్లు నయనతార తాను రాసిన ఓపెన్ లెటర్‌లో తెలిపారు.
డాక్యుమెంటరీ ఎన్‌వోసీ లేకుండా వాడేశారా?
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టెయిల్’ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన క్లిప్స్, మ్యూజిక్, లిరిక్స్ ఉపయోగించలేదు. కానీ మేకింగ్ షాట్స్ కొన్ని వాడారు. దీంతో కొందరు నెటిజన్లు నయనతారపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్‌వోసీ లేకుండా అలా ఎలా వాడతారంటూ ఇంటర్నెట్‌లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై ధనుష్ లీగల్‌గా స్పందించాల్సిందే అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
ఈ మొత్తం వివాదంపై ధనుష్ ఇంతవరకు స్పందించలేదు. ధనుష్‌తో ఇంతకు ముందు నటించిన శ్రుతి హాసన్, ఐశ్వర్య రాజేష్, పార్వతి తిరువోతు వంటి హీరోయిన్లు కూాడా నయనతారకు సపోర్ట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.