Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు

ధనుష్‌ పై నయనతార చేసిన విమర్శలు ప్రస్తుతం కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ స్పందించారు. ‘నానుమ్ రౌడీ ధాన్‌’ సినిమా రోజులను గుర్తు చేశారు.

Continues below advertisement

Radhika Sarathkumar About Dhanush: తన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్‘లో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ సినిమాకు సంబంధించి 3 సెకెన్ల వీడియోను వాడుకున్నందుకు ధనుష్ రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్‌ చేశారని నయనతార ఆరోపించారు. ఈ మేరకు తనకు లీగల్‌ నోటీసులు పంపించారన్నారు. ఈ విషయానికి సంబంధించి తాజాగా ఆమె ధనుష్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపింది. సినీ స్టార్స్, అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి ధనుష్ కు కొందరు, నయనతారకు మరికొందు సపోర్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీయర్ నటి రాధిక శరత్ కుమార్ స్పందించారు. ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు.

Continues below advertisement

Also Readవెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య

ధనుష్ మాటలు విని షాక్ అయ్యా- నటి రాధిక

‘నానుమ్ రౌడీ దాన్‌‘ సినిమాలో రాధికా శరత్‌ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే  నయనతార, విఘ్నేష్‌ మధ్య ప్రేమ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ధనుష్ తనకు ఫోన్ చేసి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి చెప్పారన్నారు. “ధనుష్ నాకు ఫోన్ చేసి “అక్క, నీకు సిగ్గు లేదా?” అన్నాడు. “నువ్ ఏం అంటున్నావో నాకు అర్థం కావట్లేదు” అన్నాను. “ఏం జరుగుతుందో మీకు తెలియదా? విక్కీ, నయన్‌ డేటింగ్‌లో ఉన్నారనే విషయం కూడా మీకు తెలియదా?” అన్నాడు. “నాకు నిజంగా తెలియదు. నువ్వు చెప్తేనే తెలిసింది అన్నాను” అని చెప్తుంది. ఈ క్లిప్ నయనతార డాక్యుమెంటరీలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ వీడియో వైరల్ కావడంతో ధనుష్ ఫీలైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. ఆ కోపాన్ని తన సినిమాలో క్లిప్ ఉపయోగించుకున్నారనే రూపంలో వెళ్లదీస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.   

నయనతార డాక్యుమెంటరీని రూపొందించిన నెట్ ఫ్లిక్స్

‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్‘ అనే డాక్యుమెంటరీని ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్‌ రూపొందించింది. నవంబర్‌ 18న విడుదల కావాల్సి ఉంది. ఈ వివాదం నేపథ్యంలో విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందులో విఘ్నేశ్‌ శివన్‌తో నయనతార ప్రేమ, పెళ్లి గురించి చూపించనున్నారు. నయనతార - విఘ్నేశ్‌ కలిసి పని చేసిన తొలి చిత్రం ‘నానుమ్‌ రౌడీ దాన్‌’. ధనుష్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విఘ్నేశ్‌, నయనతార ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్లిప్స్‌ ను డాక్యుమెంటరీలో వాడుకోవడానికి ధనుష్‌ అనుమతివ్వలేదని నయనతార ఆరోపించారు. దాదాపు రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ అంగీకరించలేదన్నారు. చుట్టుపక్కల వారి ఎదుగుదల చూడలేక ఇలాంటి పనులు చేస్తున్నాడని ఆరోపించారు. ద్వేషాన్ని కాదు ప్రేమను పంచమని నయనతార, ధనుష్ కు హితవు పలికారు. ఈ మేరకు ఆమె ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?

Continues below advertisement