Realme GT 7 Pro Pre Bookings: రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో నవంబర్ 26వ తేదీన లాంచ్ కానుందన్న సంగతి తెలిసిందే. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మార్కెట్లో రానుంది. లాంచ్‌కు ముందు దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెళ్లలో దీన్ని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి స్క్రీన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, ఎక్స్‌టెండెడ్ వారంటీ, మల్టీపుల్ పేమెంట్ ప్లాన్స్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి.


రియల్‌మీ జీటీ 7 ప్రో ప్రీ బుకింగ్ ఆఫర్స్
ఈ ఫోన్ ప్రీ బుకింగ్ చేసుకుంటే పలు ఆఫర్లను కంపెనీ అందించనుంది. అమెజాన్‌లో రూ.1,000 చెల్లించి, ఆఫ్‌లైన్ ఛానెల్స్‌లో రూ.2,000 చెల్లించి ఈ ఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.3,000 వరకు తగ్గింపు అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై 12 నెలలు, 24 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి 24 నెలలు అంటే రెండు సంవత్సరాల వారంటీ, రూ.6,598 విలువైన స్క్రీన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను అందించనున్నారు.


రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్లో ప్రీ బుకింగ్ చేసుకుంటే అదనపు లాభాలు కూడా లభించనున్నాయి. రియల్‌మీ వీఐపీ ప్రో ప్లస్ మెంబర్ షిప్ కూడా ప్రీ బుకింగ్‌పై లభించనుంది. ఫ్రీ షిప్పింగ్, ఎర్లీ యాక్సెస్, కాయిన్ రిడంప్షన్, ఇతర ఆఫ్‌లైన్ లాభాలు కూడా లభించనున్నాయి. దీంతోపాటు రూ.3,299 విలువైన రియల్‌మీ బడ్స్ ఎయిర్ 6ను రూ.2,499కే కొనుగోలు చేయవచ్చు.



Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!


రియల్‌మీ జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి?
ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. మనదేశంలో కూడా ఇదే వెర్షన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రియల్‌మీ జీటీ 7 ప్రో చైనీస్ వెర్షన్ స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 2600 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. క్వాల్‌కాం ఇటీవలే మార్కెట్లో లాంచ్ చేసిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్, 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ జీటీ 7 ప్రో పని చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... రియల్‌మీ జీటీ 7 ప్రోలో ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు చూడవచ్చు. ఈ మూడింట్లో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్906 సెన్సార్‌ని అందించారు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్ కూడా ఫోన్ వెనకవైపు అందుబాటులో ఉన్నాయి. 3x ఆప్టికల్, 120x డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేయనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ చూడవచ్చు. అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ, లైవ్ ఫొటోలు, ఏఐ బ్యాక్డ్ ఎడిటింగ్ ఫీచర్లను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


రియల్‌మీ జీటీ 7 ప్రో బ్యాటరీ సామర్థ్యం 6500 ఎంఏహెచ్ కాగా, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే... ఇన్‌డిస్‌ప్లే అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేసే అవకాశం ఉంది. 5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై 7, బ్లూటూత్ వీ5.4, జీపీఎస్, గెలీలియో, బైదు, క్యూజెడ్ఎస్ఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు.



Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!