ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2  ది రూల్’ (Pushpa 2 The Rule) టాక్ ఆఫ్ ద కంట్రీగా మారింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, షాట్స్, ఫ్రేమ్స్ అన్నీ బాగా వైరల్ అవుతున్నాయి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇంకా దర్శకులు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేనితో పాటు ఇంకా పలువురు సినీ ప్రముఖలు ట్రైలర్ మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ట్రైలర్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బన్నీతో పాటు విలన్ రోల్ చేసిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఎక్స్‌ప్రెషన్, డైలాగ్స్ మరోసారి హైలైట్ అవుతున్నాయి. ఆయన రోల్ గురించి వైఫ్ నజ్రియా కామెంట్స్ చేశారు. 


ఫహాద్ ఫాజిల్ విశ్వరూపం చూస్తారు!
‘పార్టీ లేదా పుష్ప?’ అంటూ బన్వర్ సింగ్ షెకావత్ అనే టిపికల్ పోలీస్ పాత్రలో పుష్పను ఢీ కొడతాడు ఫహాద్ ఫాజిల్. వారిద్దరి మధ్య జరిగే యుద్ధం 'పుష్ప 2'లో ఎలా ఉంటుందో? అని ఫాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే ‘పుష్ప 2  ది రూల్’లోని ఆయన చేసిన సన్నివేశాలు కూడా సినిమాపై మరింత హైప్ పెంచాయి. ‘పార్టీ ఉంది’ అని బన్వర్ పాత్ర చెప్పే డైలాగ్ వైరల్ అవుతోంది. తన భర్త ఫాహద్ ఫాజిల్ చేసిన ఈ విలన్ రోల్ గురించి కథానాయిక నజ్రియా నజీమ్ స్పందించారు. 


‘‘ఒక ఫ్యాన్ గా చెబుతున్నాను. పుష్ప 1లో ఆయన చేసిన సన్నివేశాలు బన్వర్ పాత్రకు ఇంట్రడక్షన్ మాత్రమే. పుష్ప 2లో ఫహాద్ నట విశ్వరూపం చూస్తారు’’ అని నజ్రియా నజీమ్ చెప్పారు.


Also Read: Pushpa 2 Trailer Launch Highlights - పాట్నా ప్రజల ప్రేమకు ఐకాన్ స్టార్ ఫిదా... బన్నీ స్పీచ్ to 2 లక్షల మంది జనాలు, పోలీస్ సెక్యూరిటీ - 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ హైలైట్స్



అప్పుడు రంగా...  ఇప్పుడు బన్వర్ సింగ్
ఇటీవల ‘ఆవేశం’ అనే మలయాళ చిత్రంతో రంగా పాత్రతో పాన్ ఇండియా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇచ్చేశారు ఫహాద్ ఫాజిల్. మలయాళ భాషలోనే ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు అందుకొంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై దుమ్ము రేపుతోంది. ఆయన తాజాగా నటించిన ‘బోగన్ విల్లి’ అనే మలయాళ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేదు. ఇక నజ్రియా సినిమాల విషయానికి వస్తే... నాని హీరోగా వచ్చిన ‘అంటే సుందరానికి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారీ మలయాళీ హీరోయిన్.  తాజాగా ఆమె నటించిన ఓ మలయాళీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 

‘జయ జయ జయహె’ ఫేం బాసిల్ జోసఫ్ సరసన కథానాయికగా నజ్రియా నజీమ్ నటించిన ‘సూక్ష్మదర్శిని’ అనే కామెడీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నజ్రియా ‘పుష్ప 2 ది రైజ్’ చిత్రంపై కామెంట్స్ చేశారు.


Also Readనాగ చైతన్య ఒకలా, శోభిత మరోలా... శుభ లేఖలు పంచుతున్న అక్కినేని, ధూళిపాళ ఫ్యామిలీలు, ఆ రెండూ చూశారా?



బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో చేసిన ట్రైలర్ లాంచ్ సూపర్ హిట్ కావడంతో చిత్రయూనిట్ ఫుల్  ఖూష్ గా ఉంది. డిసెంబర్ 5వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. 2డీ తో పాటు 3డీ, ఫోర్డీఎక్స్, ఐమాక్స్ ఫార్మెట్ల లో కూడా ఈ చిత్రం  చూడవచ్చని ట్రైలర్ చివరిలో హింట్ ఇచ్చేసింది చిత్ర యూనిట్.