Anushka Sharma and Virat Kohli Welcome Baby Boy: బాలీవుడ్ నటి, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ మరోసారి తల్లయ్యింది. ఈ నెల 15న ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ప్రకటించింది. అయితే అయిదు రోజులు ఆలస్యంగా ఆమె ఈ గుడ్‌న్యూస్‌ను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది.
"ప్రేమతో నిండిన హృదయాలు మరియు అంతులేని ఆనందంతో మీ అందరితో ఒక శుభవార్త పంచుకుంటున్నాను. అదేంటంటే ఈ ఫిబ్రవరి 15న మాకు మగబిడ్డ పుట్టాడు. అతని పేరు అకాయ్ (Akaay). వామిక లిటిల్ బ్రదర్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ శుభసమయం, అద్భుతమైన సమయంలో మాకు మీ అందరి అశీర్వాదాలు, బెస్ట్ విషెష్ కావాలి. అలాగే మా ప్రైవసీని కూడా గౌరవిస్తారని ఆశీస్తూ.. మీ విరాట్ అండ్ అనుష్క" అంటూ మగబిడ్డ పుట్టాడంటూ కొద్ది సేపటి క్రితమే అధికారిక ప్రకటన ఇచ్చింది అనుష్క. ఈ సందర్భంగా విరూష్క దంపతులకు సినీ, క్రిడా సెలబ్రిటీలు, నెటిజన్లు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
కాగా అనుష్క రెండోసారి గర్భందాల్చినట్టు వార్తలు, ఫొటోలతో క్లారిటీ వచ్చింది. కానీ ఈ విషయాన్ని విరూష్క జంట ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. కానీ కోహ్లి స్నేహితుడు, దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబి డివిలియర్స్ పొరపాటున్న నోరు జారి ఈ రూమర్స్‌ని నిజం చేశాడు. ఆ మధ్యలో యూట్యూబ్‌లో లైవ్ నిర్వహించిన అతడు అనుష్క ప్రెగ్నెంట్ అని, త్వరలో అతడు రెండోసారి తండ్రి కాబోతున్నందున్న ఇంగ్లాండ్‌తో జరిగే రెండు టెస్ట్ సిరీస్‌కు ఆడటం లేదని వెల్లడించాడు. దీంతో అనుష్క ప్రెగ్నెన్సీ వార్తలు ఆఫీషియల్ అయ్యాయి. ఇక తాజాగా అనుష్క మగబిడ్డ పుట్టాడంటూ ప్రకటన ఇవ్వడంతో విరూష్క జంట ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటారు.
కాగా అనుష్క-విరాట్ కొంతకాలం డేటింగ్ అనంతరం 2017 ఇటలీ మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2021లో తొలిసంతానంగా కూతురు వామిక పుట్టింది. కూతురు పుట్టి మూడేళ్లు అవుతున్న ఇప్పటి వరకు వామికను ఈ స్టార్ జంట మీడియాకు పరిచయం చేయనేలేదు. అంతలోనే తాజాగా మరోసారి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. రెండోసంతానంగా వారికి కుమారుడు పుట్టడం విశేషం. ఇక కూతురు పుట్టినప్పటి నుంచి అనుష్క పెద్దగా సినిమాలు చేయడం లేదనే విషయం తెలిసిందే. దాదాపు సినిమాలకు ఐదేళ్లు దూరంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క 'చక్దా ఎక్స్‌ప్రెస్' సినిమాలో నటించింది. ఇందులో ఆమె భారత క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్ర పోషించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇకపోతే ఆమె విరాట్ ఇంగ్లాడ్‌తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉండగా.. అనుష్క డెలివరి నేపథ్యంలో అతడు అయదే మ్యాచ్‌లకు దూరమయ్యాడు.