Malayalam Actor Vishnu Prasad Passed Away: మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. లివర్ సంబంధిత సమస్యలతో ప్రముఖ యాక్టర్ విష్ణు ప్రసాద్ (Vishnu Prasad) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఆయన కేరళలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
శుక్రవారం ఉదయం విష్ణు ప్రసాద్ తుది శ్వాస విడిచినట్లు ఆయన కో యాక్టర్ సత్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన అనారోగ్యం సమస్యల గురించి ప్రస్తావిస్తూ.. విష్ణు ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
లివర్ సంబంధిత సమస్యలతో..
బుల్లితెర, వెండితెరపై అలరించిన విష్ణు ప్రసాద్.. కొద్ది నెలల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులను సంప్రదించగా లివర్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమని వైద్యులు తెలిపారు.
డబ్బులు సేకరించే లోపే..
సర్జరీకి దాదాపు రూ.30 లక్షల మేర అవసరం కాగా.. విష్ణు ప్రసాద్ కుటుంబం, మలయాళ టీవీ యాక్టర్స్ సంఘంతో కలిసి నిధులు సేకరించడానికి ఏర్పాట్లు చేశారు. ఆర్థిక సాయం చేయాలని అందరినీ అభ్యర్థించారు. ఆయన కుమార్తెల్లో ఒకరు లివర్ డొనేట్ చేసేందుకు ముందుకొచ్చారు. డబ్బు సేకరించే లోపే విష్ణు ప్రసాద్ కన్నుమూశారు. ఆయనకు భార్య.. ఇద్దరు కుమార్తెలు అభిరామి, అననిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.
సినిమాల విషయానికొస్తే.. విష్ణు ప్రసాద్ 'కైయేతుమ్ దూరత్', 'కాశీ', 'మాంబఝక్కలం', 'బెన్ జాన్సన్', 'లోకనాథన్ IAS', 'లయన్' సినిమాల్లో నటించారు. ఇక పలు సీరియళ్లలోనూ విలన్ రోల్స్‌లో నటించి మెప్పించారు.
Also Read: విజయ్ దేవరకొండకు షాక్ - ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంప్లైంట్.. అసలు కారణం ఏంటంటే?