Anupama Parameswaran's New Film Paradha First Look, Cast And Crew Details Revealed: 'టిల్లు స్క్వేర్'తో అనుపమా పరమేశ్వరన్ సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమాలో ఆమె గ్లామర్ అప్పియరెన్స్, నటనకు పేరు వచ్చింది. నెక్స్ట్ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ రోల్ చేసినట్టు ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతోంది. డీ గ్లామర్ పాత్రలో అనుపమ లుక్ ఆకట్టుకుంటోంది.


'పరదా'లో అనుపమను చూశారా?
అనుపమా పరమేశ్వరన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'పరదా'. 'సినిమా బండి'తో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల, ఆ సినిమా తర్వాత తీస్తున్న చిత్రమిది. శ్రీమతి భాగ్యలక్ష్మి పోస సమర్పణలో ఆనంద మీడియా పతాకంపై శ్రీనివాసులు పీజీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 


స్టార్ హీరోయిన్ సమంత, దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఇవాళ 'పరదా'లో అనుపమ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్ చూస్తే... ఆమె తప్ప మిగతా అందరి ముఖాలు పరదా వెనుక ఉన్నాయి. అనుపమ ముఖం మాత్రమే కనిపిస్తోంది. కాన్సెప్ట్ పోస్టర్ వీడియోలో 'యత్ర నార్యస్తు పూజ్యంతే' శ్లోకం నేపథ్య సంగీతంలో వినిపించింది.


Also Read: వెంకటేష్ ఎన్నికల ప్రచారం... వియ్యంకుడితో పాటు భార్య మేనమామ కోసం - ఎక్కడెక్కడ అంటే?






తెలుగు తెరకు పరిచయం అవుతున్న 'హృదయం' దర్శన!
'పరదా' సినిమాలో అనుపమతో పాటు దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. మలయాళ కథానాయిక దర్శనకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ 'హృదయం' సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు ఎందరో! మరో మలయాళ సినిమా 'జయ జయ జయహే' ఓటీటీలో విడుదల అయ్యాక మరికొంత మంది ఆమెను అభిమానించడం మొదలు పెట్టారు. తెలుగులో దర్శనకు 'పరదా' తొలి సినిమా.


Also Readపిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?



హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో చిత్రీకరణ
'పరదా' చిత్రాన్ని హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీతో పాటు కొన్ని గ్రామాల్లో చిత్రీకరణ చేసినట్టు దర్శక నిర్మాతలు చెప్పారు. చివరి షెడ్యూల్ మే నెలలో హైదరాబాద్ సిటీలో చేయనున్నట్టు తెలిపారు. అనుపమ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ... ''ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వడం కోసం తీసిన చిత్రమిది. కేవలం వినోదం అందించడమే మా ఉద్దేశం కాదు... వారిలో ఒక ఆలోచన తీసుకు వచ్చే చిత్రమిది. మా సినిమాను ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా? అని వెయిట్ చేస్తున్నా'' అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ... ''ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు, ఎంగేజ్ చేసే కథ, క్యాచీ సాంగ్స్ ప్రేక్షకుల్ని సినిమా చూసేంత సేపూ కట్టి పడేస్తాయి'' అని చెప్పారు.


Also Readరత్నం రివ్యూ: సింగమ్ సిరీస్ హరి దర్శకత్వంలో విశాల్ హ్యాట్రిక్ ఫిల్మ్.... అవుట్ డేటెట్ యాక్షన్ సినిమాను చూడగలమా?



అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'పరదా' చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: పూజితా తాడికొండ, కళా దర్శకత్వం: శ్రీనివాస్ కళింగ, సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, ఛాయాగ్రహణం: మృదుల్ సుజిత్ సేన్, స్క్రిప్ట్ డాక్టర్: కృష్ణ ప్రత్యూష, రచయితలు: పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పూడి, పాటలు: వనమాలి, సంగీతం: గోపీసుందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రోహిత్ కొప్పు, నిర్మాతలు: విజయ్ డొంకాడ - శ్రీనివాసులు పీవీ - శ్రీధర్ మక్కువ, నిర్మాణ సంస్థ: ఆనందా మీడియా, కథ - కథనం - దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల.