raashi khanna Yodha Movie now Streaming on ott: రీఎంట్రీ తర్వాత టాలీవుడ్‌ బ్యూటీ రాశీ ఖన్నా నటించిన తొలి హిందీ చిత్రం 'యోధ'. సుమారు పదకొండేళ్ల తర్వాత రాశీ ఖన్నా ఈ చిత్రంలో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓజా ఈ సినిమాను తెరకెక్కించారు. ధర్మ ప్రొడక్షన్‌లో కరణ్‌ జోహర్ నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. మార్చి 15నభారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడులైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దాదాపు రూ. 55 కోట్ల బడ్జెట్‌ తెరకెక్కిన ఈ సినిమా మొత్తం రూ. 32 కోట్లు మాత్రమే గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. థియేటర్లో నిరాశ పరిచిన 'యోధ' ఇప్పుడు డిజిటల్‌ ప్రిమియర్‌కు వచ్చేసింది.


ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైం ఈ మూవీ సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చింది. మూవీపై ఎలాంటి ప్రకటన ఇవ్వకుండానే ఏప్రిల్‌ 26 అంటే నేటి రాత్రి నుంచి ఓటీటీలో అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు అమెజాన్‌ ఓ కండిషన్‌ పెట్టింది. ఈ మూవీని ఫ్రీగా చూడకుండ అద్దే ప్రాతిపాదికన స్ట్రీమింగ్‌కి ఇచ్చింది. అంటే ప్రస్తుతం ఓటీటీలో యోధ చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. అయితే ఇది మే 10 వరకే. ఆ తర్వాత నుంచి ఈ సినిమా ఫ్రీగా చూడోచ్చని అమెజాన్‌ పేర్కొంది. దీంతో ప్లాప్‌ అయినా సినిమాకు మళ్లీ డబ్బులు చెల్లించడం ఎందుకంటున్నారు కొందరు డిజిటల్‌ ఆడియన్స్. సలార్‌, యానిమల్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలకే ఇలాంటి షరతులు లేవని, అలాంటిది ప్లాప్‌ అయినా సినిమాకు డబ్బులు చెల్లించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ, థియేటర్లో మిస్‌ అయిన మూవీ లవర్స్‌ మాత్రం ఈ సినిమాకు డబ్బులు చెల్లించి చూసేస్తున్నారట. మొత్తానికి ప్లాప్‌ అయినా ఈ బాలీవుడ్‌ యాక్షన్‌ మూవీ సైలెంట్‌గా ఓటీటీ రావడం గమనార్హం. 


Also Read: బాబోయ్‌ కీర్తి ఏంటీ ఇలా రెచ్చిపోయింది - అమాంతం గ్లామర్‌ డోస్ పెంచేసిన 'మహానటి', హర్ట్‌ అవుతున్న ఫ్యాన్స్‌


కాగా విమానం హైజాక్‌ నేపథ్యంలో 'యోధ' సినిమాను తెరకెక్కింది. సిద్ధార్థ్‌ మల్హోత్రా ఎయిర్‌ ఫోర్స్‌ అధికారిక నటించగా రాశీ ఖన్నా అతడి సరసన హీరోయిన్‌గా నటించింది. ఇక దిశా పటానీ ఎయిర్ హోస్టెస్‌గా కీలక పాత్రలో అలరించింది. ఈ విమానంను కొందరు టెర్రరిస్టులు హైజాక్‌ చేస్తారు. అదే ఈ విమానంలో రాశీ ఖన్నా, దిశా పటానీలు కూడా ఉంటారు. ట్రెర్రరిస్టుల నుంచి ప్యాసింజర్స్‌ను కాపాడేందుకు ప్రభుత్వం యోధ పేరుతో ఓ టాస్క్‌ ఫోర్స్‌ టీంను నిర్వహిస్తుంది. ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి అయిన అరుణ్ క‌థియాల్‌(సిద్ధార్థ్‌ మల్హోత్రా) టాస్క్‌ ఫోర్స్‌ టీంకు సాయం చేస్తాడు. ఈ క్రమంలో అతడే స్వయంగా రంగంలోకి దిగి ప్యాసింజర్స్‌ని రక్షిస్తాడు.  ఈ క్రమంలో రాశీ ఖన్నా, దిశ పటానీ పాత్రలు ఆపరేషన్‌లో ఎలా భాగం అయ్యారు, సిద్ధార్థ్‌ టెర్రిరిస్టులను ఎలా మట్టుకరిపించాడనేదే ఈ యోధ సినిమా. అయితే ఇందులో భారీ యాక్షన్‌ సీక్వెల్స్‌ ఉన్నా అవి పెద్దగా ఆకట్టుకోలేదని, అందులో మూవీ ప్లాప్‌ అయ్యిందనేది ఓ వర్గం ఆడియన్స్‌ అభిప్రాయం.