Prasanth Varma, Teja Sajja Meet Telangana Governer: చిన్న సినిమా.. రిలీజ్ టైంలో కనీసం థియేటర్ల కూడా దొరకని సినిమా.. కానీ, ఇప్పుడు ప్రభంజనం సృష్టించింది. రికార్డులు మోత కొనసాగిస్తోంది. 100 రోజులు పూర్తి చేసుకుని, ఇంకా ముందుకు దూసుకెళ్తుంది 'హనుమాన్'. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ, 'హనుమాన్' టీమ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఎంతోమంది ప్రముఖులు సినిమా టీమ్ ని కలిసి మరీ అభినందించారు. ఇక ఇప్పుడు తెలంగాణ కొత్త గవర్నర్ సిపి. రాధాకృష్ణన్ హనుమాన్ టీమ్ ని అభినందించారు.
మిమ్మల్ని కలవడం ఆనందం..
'హనుమాన్' సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ తెలంగాణ గవర్నర్ సిపి. రాధాకృష్ణణ్ ని కలిశారు. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు ఒక హనుమాన్ విగ్రహాన్ని బహుమతిగా అందించారు. "గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ శ్రీ రాధాకృష్ణన్ గారిని కలిసే అపురూపమైన అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మా హనుమంతుడు థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నాం. ఇలాంటి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది" అంటూ ఫొటోలను పోస్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఆయనతో పాటు తేజ సజ్జ కూడా గవర్నర్ ని కలిశారు.
ఇటీవలే 100 రోజుల ఫంక్షన్..
సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా హనుమాన్. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా రికార్డులు మీద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడి.. ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. సినిమా ఇండస్ట్రీలో చాలా రోజులు తర్వాత 100 రోజుల ఫంక్షన్ నిర్వహించడం ఆనందంగా ఉంది అని ప్రశాంత్ వర్మ అన్నారు.
'జై హనుమాన్' లో బాలీవుడ్ టూ కోలీవుడ్..
'హనుమాన్' సినిమాకి సెకెండ్ పార్ట్ ఉందని ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని చెప్పారు ప్రశాంత్ వర్మ. 'జై మనుమాన్' లో పెద్ద పెద్ద స్టార్స్ ఉండబోతున్నారని అన్నారు. అన్ని భాషల నుంచి యాక్టర్స్ ఉంటారని, ఈ సినిమాలో చేసేందుకు ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రశాంత్ వర్మ తెలుగోడు రా అని గొప్పగా చెప్పుకునేలా ఆ సినిమా ఉంటుందని అన్నారు ప్రశాంత్ వర్మ. 'జై హనుమాన్' లో కూడా సముద్రఖని గారు విభీషణుడి ప్రాత చేస్తున్నారని, తేజ హనుమ్యాన్ గా కంటిన్యూ చేస్తారని, చాలా సర్ ప్రైజింగ్ క్యారెక్టర్స్ వస్తాయని చెప్పారు ప్రశాంత్ వర్మ. దీంతో ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.
Also Read: పెళ్లి పీటలెక్కబోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?