Jr NTR Fires On Paparazzi: ‘RRR’తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్‌టీఆర్.. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టాడు. ఒకవైపు తెలుగులో ‘దేవర’ మూవీతో బిజీగా ఉంటూనే.. మరోవైపు బాలీవుడ్ హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అలా రెండు ఇండస్ట్రీల్లో రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌తో జూనియర్ ఎన్‌టీఆర్ బిజీగా ఉండడంతో తన గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఎక్కువగా తన ప్రొఫెషనల్ విషయాల గురించే వార్తలు వైరల్ అవుతూ వస్తున్నా.. మొదటిసారి ఎన్‌టీఆర్ ఫోటోగ్రాఫర్లపై ఫైర్ అవ్వడం తాజాగా వైరల్ అయ్యింది.


ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం..


జూనియర్ ఎన్‌టీఆర్.. ఎప్పుడూ తన ఫ్యాన్స్‌ను, కో స్టార్స్‌ను చిరునవ్వుతోనే పలకరిస్తాడు. తనకంటూ ఎక్కువగా కోపం రావడం, ఇతరులపై తను కోప్పడడం లాంటివి చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ తాజాగా ఫోటోగ్రాఫర్ల తీరుపై పూర్తిగా తన సహనాన్ని కోల్పోయిన ఎన్‌టీఆర్.. ఫైర్ అయ్యాడు. సింపుల్ వైట్ షర్ట్‌, బ్లూ జీన్స్‌లో నవ్వుతూ ఫోన్‌లో మాట్లాడుతూ ముంబాయ్‌లోని ఒక హోటల్‌లోకి వెళ్తూ కనిపించాడు తారక్. ఆయన్ని చూడగానే ఫోటోగ్రాఫర్లు అంతా తన వెనక పరిగెత్తారు. దీంతో వారి ప్రవర్తన వల్ల ఎన్‌టీఆర్‌కు కోపం వచ్చిందని తాజాగా వైరల్ అయిన వీడియో చూస్తుంటే అర్థమవుతోంది.


ఓయ్..


ఎన్‌టీఆర్ హోటల్ లోపలికి వెళ్తున్న సమయంలో కూడా ఫోటోగ్రాఫర్లంతా ఎంట్రీ దగ్గరకు వెళ్లి మరీ చాలా దగ్గరగా ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. ఇది ఎన్‌టీఆర్‌కు నచ్చలేదు. ఓయ్ అని అరిచి, ‘‘అవి మర్యాదగా వెనక్కి పెట్టేయండి’’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఎన్‌టీఆర్.. ఫోటోగ్రాఫర్లపై కోప్పడ్డాడు అంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే ‘వార్ 2’ కోసం ముంబాయ్‌లో ఈ హీరో అడుగుపెట్టినప్పటి నుండి ఫోటోగ్రాఫర్ల వల్ల తనకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ముందుగా ‘వార్ 2’ సెట్స్ నుండి ఎన్‌టీఆర్ అంటూ తన ఫోటో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అదే గెటప్‌లో ఉన్న తనను ఫోటో తీయడానికి ప్రయత్నించడంతో ఎన్‌టీఆర్ సీరియస్ అవ్వక తప్పలేదు.






ఫ్యాన్స్ వార్ మొదలు..


ఈ సందర్భాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్న బాలీవుడ్ ప్రేక్షకులు.. టాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఫ్యాన్ వార్స్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫోటోగ్రాఫర్లపై మరీ అంతగా కోప్పడడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అదునుగా తీసుకొని టాలీవుడ్ హీరోలు అందరినీ విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎన్‌టీఆర్‌కు సపోర్ట్ చేస్తూ.. సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉండాలని, అలా ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవ్వడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Also Read: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా..