Megha Akash Marriage: ఇప్పుడంతా సెల‌బ్రిటీ వెడ్డింగ్ సీజ‌న్ న‌డుస్తున్న‌ట్లే క‌నిపిస్తుంది. ఒక్కొక్క‌రు వ‌రుస‌గా పెళ్లి చేసుకుంటున్నారు. లావ‌ణ్య త్రిపాఠి, ర‌కుల్ ప్రీత్ సింగ్, తాప్సీ, అపర్ణ దాస్ పెళ్లి పీట‌లెక్కిన విష‌యం తెలిసిందే.  వరలక్ష్మి శరత్ కుమార్, తమన్నా కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పుడిక 'లై' సినిమా బ్యూటీ మేఘా ఆకాశ్ కూడా పెళ్లి చేసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ మాత్రం ఇవ్వ‌లేదు మేఘ. 


ఇన్ స్టా పోస్ట్ వైర‌ల్.. 


సెల‌బ్రిటీలు ఒక పోస్ట్ పెడితే చాలు.. దాన్ని వెనుక ఉన్న అర్థాన్ని ఇట్టే ప‌సిగ‌డ‌తారు అభిమానులు. అలానే మేఘా ఆకాశ్ పెట్టిన ఒక పోస్ట్ తో ఇప్పుడు ఆమె పెళ్లి రూమ‌ర్స్ బ‌య‌ట‌కి వ‌చ్చాయి. చ‌క్క‌గా చీర క‌ట్టుకుని, అందంగా రెడీ అయిన ఫొటో ఇన్ స్టాలో పోస్ట్ చేశారు మేఘ. అంతేకాదు.. చేతి నిండుగా మెహందీ పెట్టుకుని ఉన్న ఫొటోలు షేర్ చేశారు. దానికి కింద మ్యారేజ్ వైబ్స్ అని రాసుకొచ్చారు. దీంతో అంద‌రూ ఆమె పెళ్లి అని అనుకుంటున్నారు. మేఘా చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్త‌లు  బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే వాటి గురించి మేఘ కుటుంబం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇక ఇలాంటి వార్త‌లే గ‌తంలో కూడా వైరల్ అయ్యాయి. మేఘ పెళ్లి పీట‌లెక్క‌బోతుంది అంటూ సోష‌ల్ మీడియాలో వార్త తెగ హ‌ల్ చ‌ల్ చేసింది. 






యాడ్ షూట్ ఫొటోలు? 


అయితే, ఈ ఫొటోలు నిజ‌మైన పెళ్లి ఫొటోలు కాద‌నే వార్త కూడా వినిపిస్తోంది. ఒక యాడ్ షూట్ కి సంబంధించిన ఫొటోలు   అని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, హ్యాష్ ట్యాగ్ వెడ్డింగ్ వైబ్స్ అని పెట్ట‌డంతో నిజంగానే పెళ్లి అని అంటున్నారు ఇంకొంద‌రు. ఏదేమైనా ఈ విష‌యంపై మేఘా స్పందించి క్లారిటీ ఇవ్వాలి. లేదా వాళ్ల కుటుంబ‌స‌భ్యులు చెప్పాలి. 


'లై' సినిమాతో ఎంట్రీ.. 


మేఘా ఆకాశ్.. తెలుగులో చాలా సినిమాలు చేసినా.. అంత‌గా గుర్తింపు పొంద‌లేదు. 'లై' ఆమె మొద‌టి సినిమా కాగా.. 'ఛ‌ల్ మోహ‌న రంగ‌', 'గుర్తుందా శీతాకాలం', 'రావ‌ణాసుర' త‌దిత‌ర సినిమాల్లో న‌టించింది మేఘ. కాగా.. ఇప్పుడు రెండు సినిమాలు, ఒక త‌మిళ సినిమాలో న‌టిస్తుంది. 'సఃకుటుంబానాం సినిమాలో రామ్ కిరణ్ స‌ర‌న‌స న‌టిస్తున్నారు మేఘ.  హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకంపై మహాదేవ గౌడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఉదయ్ శర్మ రచయిత, దర్శకుడు.  సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రాజశ్రీ నాయర్, 'శుభలేఖ' సుధాకర్ త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు మా 'సఃకుటుంబానాం' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ లో!


తెలంగాణ నేపథ్యంలో వ‌స్తున్న ‘విక‌ట‌కవి’ వెబ్ సిరీస్ లో కూడా న‌టిస్తున్నారు మేఘ ఆకాశ్. 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం', 'మెన్ టూ', మాయలో' సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు నరేష్ అగస్త్య హీరో కాగా..  ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు.


Also Read: జక్కన్న అలా పరిచయమయ్యారు, వెంటనే ప్రేమ పుట్టలేదు - మా రిటైర్మెంట్ ప్లాన్ అదే: రమా రాజమౌళి