Keerthy Suresh Glamour Look Goes Viral: కీర్తి సురేష్‌ ఈ పేరు వినగానే అందరికి 'మహానటి' సినిమా గుర్తుకు వస్తుంది. ఈ బయోపిక్‌లో అచ్చం సావిత్రిలా హవభావాలు పలికించింది కీర్తి సురేష్‌. అలనాటి తార సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి నేషనల్‌ అవార్డును సైతం అందుకుంది. అంతగా తన నటనతో సావిత్రిని గుర్తు చేసింది ఈ భామ. ఈ సినిమాతో అంతా 70's, 80'sలో సావిత్రి, 90'sలో సౌందర్య.. ఇప్పుడు కీర్తి సురేష్‌ అంటూ వారితో పోల్చుకున్నారు. కీర్తి కూడా ఎక్కవగా గ్లామర్‌ షోకు పోకుండ తన పరిధి వరకు గ్లామరస్‌ పాత్రలు చేస్తూ వస్తుంది.  


బేబీ జాన్‌ సెట్‌లో క్లివేజ్‌ షో


ఇప్పటి వరకు ఆమె పరిధికి మించి గ్లామర్‌ షో చేసింది లేదు. 'నేను శైలజ' నుంచి మొన్నటి 'సైరన్‌' వరకు అన్ని డిసెంట్‌ రోల్సే చేసింది. ఇటీవల నాని 'దసరా'లో అయితే డీ గ్లామర్‌ రోల్లో పల్లెటూరి అమ్మాయిగా అలరించింది. అలా తెరపై తన కట్టు, బొట్టుతో అచ్చమైన తెలుగుంటి అమ్మాయిగా ఆకట్టుకున్న కీర్తి తాజాగా ఫుల్‌ గ్లామర్‌ షోతో రెచ్చిపోయింది. కీర్తిని ఇలా చూసి ఆమె ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. అదేంటి మరి ఇంతలా రెచ్చిపోతుందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా కీర్తి సురేష్‌ ప్రస్తుతం ఓ హిందీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ బేబీ జాన్‌లో హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసింది. ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది.






ఇలా నార్త్‌లో అడుగుపెట్టిందో లేదో అప్పుడే గ్లామర్‌ డోస్ పెంచేసింది. తాజాగా బేబీ జాన్‌ సెట్‌లోని ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మూవీలోని ఓ సాంగ్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. అలాగే ఏప్రిల్‌ 24న వరుణ్‌ ధావన్‌ బర్త్‌డే సందర్భంగా సెట్‌లో సెలబ్రేషన్స్‌ చేశారు. ఈ సందర్భంగా మూవీ హీరో, హీరోయిన్‌తో కేక్‌ కట్‌ చేయించారు. ఈ సందర్భంగా కీర్తి ఫ్యాన్సీ శారీలో మెరిసింది. అయితే ఇందులో ఆమె ట్రిప్‌ లెస్‌, డీప్‌ నెక్‌ జాకేట్‌ వేసింది. ఇందులో డీప్‌ క్లీవేజ్‌ షో కనిపించింది. ఫస్ట్‌టైం అలా ఆమె గ్లామర్‌ షో అంతా అవాక్క్‌ అవుతున్నారు. ఇలా బాలీవుడ్‌లో అడుగుపెట్టిందో లేదో అమాంతం గ్లామర్‌ డోస్‌ పెంచిందని, మరి ఇంతలా గ్లామర్‌ షో చేయాలా? నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి గ్లామరస్‌ ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. ఆమెను ఇలా చూసి సౌత్‌ ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతున్నారు.



Also Read: పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటున్న మృణాల్! - ఈ విషయంలో ఆ నటిని ఫాలో అవుతానంటున్న బ్యూటీ