ప్రేక్షకులు ఇప్పటి వరకు అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)లో నటిని మాత్రమే చూశారు. అవకాశం రావాలే గానీ... స్క్రీన్ మీద నటించడమే కాదు, స్క్రీన్ వెనుక వర్క్ చేయడం కూడా తనకు వచ్చని ఆమె ప్రూవ్ చేశారు. అనుపమలో ఇంత టాలెంట్ ఉందా? అని చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. అసలు వివరాల్లోకి వెళితే... 


అనుపమ సినిమాటోగ్రఫీ!
Anupama Parameshwaran turns cinematographer : అనుపమా పరమేశ్వరన్ ఛాయాగ్రాహకురాలిగా మారారు. అవును, ఆమె సినిమాటోగ్రఫీలో తన టాలెంట్ చూపించారు. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ 'ఐ మిస్ యు' (I Miss You Short Film). దీనికి అనుపమా పరమేశ్వరన్ సినిమాటోగ్రఫీ అందించడమే కాదు, ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు కూడా చూసుకున్నారు. 


'ఐ మిస్ యు' కథ ఏంటి?
అనగనగా ఓ యువకుడు. అతడు అమెరికాలో ఉంటాడు. తల్లిదండ్రులు ఏమో మన దేశం (ఇండియా)లో ఉంటాడు. పేరెంట్స్ అండ్ సన్ మధ్య ఎటువంటి సంబంధం ఉంది? అనే కథతో 'ఐ మిస్ యు' షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. దీనికి అనుపమ సినిమాటోగ్రాఫర్. కొన్ని షార్ట్స్ మనం వీడియో కాల్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో? అలా ఉన్నాయి. అనుపమ కెమెరా వర్క్ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. యూట్యూబ్ లో ఈ షార్ట్ ఫిల్మ్ అందుబాటులో ఉంది. దీని నిడివి పది నిమిషాలు!


అనుపమతో హీరోగా నటించిన నిహాల్ కోదాటి   
గత ఏడాది చివర్లో ఓటీటీలో విడుదల అయిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'బటర్ ఫ్లై'లో అనుపమ పరమేశ్వరన్ కనిపించారు. అందులో హీరోగా నటించిన నిహాల్ కోదాటి, ఇప్పుడీ 'ఐ మిస్ యు' షార్ట్ ఫిలింలో కూడా నటించారు. కథానాయికగా వరుస సినిమాల్లో నటిస్తూ... తనలో మరో టాలెంట్ అనుపమ బయట పెట్టడం విశేషమే. 


నిహాల్... సంకల్ప్... థాంక్స్!
'ఐ మిస్ యు' అనే అందమైన ప్రాజెక్టులో తనను చిన్న భాగం చేసినందుకు సంకల్ప్ గోరా, నిహాల్ కోదాటికి అనుపమా పరమేశ్వరన్ థాంక్స్ చెప్పారు. కథ చదివినప్పుడు తనకు అద్భుతమైన అనుభూతి కలిగిందని, షార్ట్ ఫిల్మ్ చూసే ప్రేక్షకులకు కూడా అటువంటి అనుభూతి కలుగుతుందని తాను ఆశిస్తున్నట్లు అనుపమ పేర్కొన్నారు. ఫ్యామిలీతో కలిసి 'ఐ మిస్ యు' చూడమని ఆమె కోరారు. 
అనుపమకు నిహాల్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. సినిమాటోగ్రఫీ విషయంలో ప్రతి చిన్న విషయంలో అనుపమ డీటెయిల్ గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 






ఇంతకు ముందు సహాయ దర్శకురాలిగా...
కెమెరా వెనుక అనుపమా పరమేశ్వరన్ టెక్నికల్ వర్క్ చేయడం ఇది రెండోసారి. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేసిన 'మానియారయిలే ఆశోకన్' సినిమాకు ఆమె సహాయ దర్శకురాలిగా వర్క్ చేశారు. ఆ సినిమాలో హీరోయిన్ కూడా అనుపమా పరమేశ్వరనే. తనకు నటనతో పాటు మిగతా విషయాల్లో కూడా ఆసక్తి ఉందని ఆమె చెబుతూ వస్తున్నారు.


Also Read : మోహన్ లాల్ గ్యారేజీలో నయా కార్ - రేటు ఎంతో తెలుసా?


మలయాళ 'ప్రేమమ్'తో వెండితెరకు పరిచయమైన అనుపమా పరమేశ్వరన్... ఆ సినిమా తెలుగు రీమేక్, అక్కినేని నాగ చైతన్య 'ప్రేమమ్'లో కూడా నటించారు. ఆ తర్వాత త్రివిక్రమ్ 'అ ఆ', 'శతమానం భవతి', 'రాక్షసుడు', 'రౌడీ బాయ్స్', '18 పేజెస్', 'కార్తికేయ 2' వంటి సినిమాల్లో కథానాయికగా నటించి విజయాలు అందుకున్నారు. 


Also Read పవన్ కళ్యాణ్‌తో శ్రీలీల - నేటి నుంచి ఉస్తాద్ లవ్ సీన్లు!