మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) దగ్గర సుమారు అర డజను లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన గ్యారేజీలో కొత్త కారు వచ్చి చేరింది. వైట్ కలర్ రేంజ్ రోవర్ ఎస్.యు.విని ఆయన కొన్నారు. కారుతో ఆయన దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


భార్య సుచిత్రతో కలిసి షోరూంకు వచ్చిన మోహన్ లాల్, కారు కీస్ తీసుకున్నారు. అనంతరం ఆమెను ఎక్కించుకుని ఇంటికి వెళ్లారు. మోహన్ లాల్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారు రేటు సుమారు ఐదు కోట్లు ఉంటుందని టాక్. ఇది కాకుండా ఆయన దగ్గర సుమారు మూడు కోట్లు ఖరీదు చేసిన లంబోర్ఘిని, ఇంకా మెర్సిడెస్ బెంజ్, టయోటా ల్యాండ్ క్రూజర్ కార్లు ఉన్నాయి. 


సినిమాలకు వస్తే... ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా విజయ్ 'బీస్ట్', శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్' సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'జైలర్' సినిమాలో మోహన్ లాల్ నటిస్తున్నారు. అందులో ఆయనది కీలక పాత్ర అని తెలిసింది. అది కాకుండా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సూపర్ హిట్ 'లూసిఫర్'కు సీక్వెల్ 'ఎల్ 2 : ది ఎంపరర్' సినిమా కూడా మోహన్ లాల్ చేస్తున్నారు. 


Also Read : పవన్ కళ్యాణ్‌తో శ్రీలీల - నేటి నుంచి ఉస్తాద్ లవ్ సీన్లు!






'లూసిఫర్ 2'... లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసినా?
'లూసిఫర్'కు సీక్వెల్‌గా 'లూసిఫర్ 2 ఎంపరర్' (Lucifer 2 Empuraan) సినిమా వస్తోంది. గత ఏడాది మేలో స్క్రీన్ ప్లే కంప్లీట్ చేసినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక అప్ డేట్ ఇచ్చారు. తర్వాత ఆగస్టులో మరోసారి సినిమా టీమ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. మోహన్ లాల్, నిర్మాత ఆంటోనీ పెరంబవూర్, నటుడు మురళీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయలేదు. ఈ ఆగస్టులో సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. 






ఆరు నెలలు మరో సినిమా చేయకూడదని! 
'లూసిఫర్ 2' కోసం మోహన్ లాల్ ఆరు నెలలు డేట్స్ కేటాయించారట. ఫస్ట్ పార్టులో స్క్రీన్ మీద ఆయన కనిపించేది తక్కువ సేపే. అయినా సరే... కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. సెకండ్ పార్టులో మాత్రం ఆయన రోల్ లెంగ్త్, స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ సేపు ఉంటాయట. అందుకని, ఆరు నెలలు డేట్స్ ఇచ్చారట. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే... ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారట. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మోహన్ లాల్ ఈ విధంగా ఎప్పుడూ చేయలేదు. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ, ఈసారి ఒక్కటే చేయాలని డిసైడ్ కావడం విశేషమే. దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 


'లూసిఫర్'లో మోహన్ లాల్‌ను రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన నాయకుడిగా చూపించారు. ముంబై మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు, కనుసైగతో మాఫియాను శాసించగల సత్తా ఉన్న డాన్‌గానూ పరిచయం చేశారు. క్లైమాక్స్‌లో అయితే మోహన్ లాల్ హెలికాఫ్టర్ నుంచి దిగిన షాట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇప్పుడీ 'లూసిఫర్ 2'లో మోహన్ లాల్ డాన్ రోల్ హైలైట్ కానుందని టాక్. డెవిల్ గా ఆయన చూపించే హీరోయిజం నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని టాక్.  
  
Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?