పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా యువ దర్శకుడు, ఆయనతో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన హరీష్ శంకర్ (Harish Shankar) తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie). ప్రస్తుతం హైదరాబాదులో చిత్రీకరణ జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల ఈ రోజు నుంచి షూటింగ్ చేస్తున్నారట!


పవన్ - శ్రీలీల - లవ్లీ సీన్లు
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉంది. అందులో ఒకరు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపిస్తారు. హీరోను ప్రేమించి, పెళ్లి చేసుకునే పాత్ర అది. మరొకరు ప్రజెంట్ సన్నివేశాల్లో కనిపిస్తారు. ఆమెది టీచర్ టైపు రోల్. ఆ ఇద్దరిలో ఒకరిగా శ్రీలీల (Sreeleela)ను ఎంపిక చేశారు. ఈ రోజు నుంచి ఆమె షూటింగులో జాయిన్ అవుతారని తెలిసింది. ఇద్దరు హీరోయిన్లతో లవ్లీ సీన్లు ఉన్నాయని తెలిసింది. మరి, శ్రీలీల క్యారెక్టర్ ఏమిటో? మరో కథానాయికగా పూజా హెగ్డే (Pooja Hegde) పేరు వినబడుతోంది. అయితే, ఆమె ఇంకా సంతకం చేయలేదు. 


పవన్ లుంగీ లుక్ లీక్ చేశారు
Pawan Kalyan Lungi Look : ఇటీవల హైదరాబాదులోని ఎర్రమంజిల్ ఏరియాలో షూటింగ్ చేశారు. సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ ఫోటోలు లీక్ అయ్యాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ లుంగీతో కనిపిస్తారు. ఈ సినిమాలో పవన్ పోలీసుగా కనిపించనున్నారు. ఇంతకు ముందు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్'లో సైతం పోలీస్ రోల్ చేశారు. అలాగే, 'భీమ్లా నాయక్' సినిమాలోనూ పోలీస్ రోల్ చేశారు. ఆ రెండు సినిమాల్లో కూడా లుంగీ లుక్ ఉంటుంది. మరోసారి లుంగీ వేయడంతో ఫ్యాన్స్ సూపర్ హిట్ పక్కా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 


Also Read : చిరంజీవికి లేట్ రిప్లై - బన్నీ బర్త్‌డే సాక్షిగా 'మెగా' వార్


'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం పవన్ కళ్యాణ్ సన్నిహిత మిత్రుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి భారీ సెట్ వేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ సెట్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. 


పదేళ్ళ తర్వాత... 
'గబ్బర్ సింగ్' కాంబో!
పవన్ కళ్యాణ్ అంటే హరీష్ శంకర్ (Harish Shankar)కు విరీతమైన అభిమానం. తన అభిమాన హీరోను దర్శకత్వం వహించే అవకాశం 'గబ్బర్ సింగ్'తో ఆయనకు లభించింది. ఆ సినిమా మే 11, 2012న విడుదల అయ్యింది. బాక్సాఫీస్ బరిలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అది విడుదలైన సుమారు పదకొండేళ్ళకు మళ్ళీ పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ కుదిరింది. అందుకని, షూటింగ్ మొదలైన రోజున 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం...' అంటూ హరీష్ శంకర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.  


'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. సినిమాకు గత ఏడాది డిసెంబర్ లో పూజ చేశారు. ఇందులో వీజే సన్నీ ఓ రోల్ చేస్తున్నారు.


Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?