మెగా కుటుంబానికి చిరంజీవి (Megastar Chiranjeevi) పెద్ద దిక్కు. ఆయన వేసిన బాటలో నడుస్తూ చాలా మంది హీరోలు వచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి తర్వాత అరడజను మందికి పైగా హీరోలు వచ్చారు. చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్, మేనల్లుడు అల్లు అర్జున్, తనయుడు రామ్ చరణ్ స్టార్ హీరోలుగా ఎదిగారు. ఆ హీరోల మధ్య ఇప్పుడు సత్సంబంధాలు అంతగా లేవా? అల్లు అర్జున్ పుట్టినరోజు సాక్షిగా ఆ విబేధాలు మరోసారి బయట పడ్డాయా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చర్చ జోరుగా సాగుతోంది. మెగా అభిమానులు, అల్లు అభిమానుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.


చిరంజీవికి లేటుగా రిప్లై ఇవ్వడం ఏమిటి?
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా స్టార్స్ చాలా మంది ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. ఎన్టీఆర్, ఆయనకు మధ్య జరిగిన ట్వీట్స్ వాళ్ళిద్దరి మధ్య స్నేహానికి చిరునామాగా నిలిచాయి. అదే సమయంలో మెగా అభిమానుల్లో ఆగ్రహానికి కూడా దారి తీశాయి. 


బన్నీకి బర్త్ డే విషెష్ చెబుతూ... చిరంజీవి శనివారం ఉదయమే ట్వీట్ చేశారు. ఆ తర్వాత ట్వీట్స్ చేసిన వాళ్ళకి ముందుగా రిప్లై ఇచ్చి థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిరుకు రిప్లై ఇచ్చారు. ఆయన కావాలని లేటు చేశారని మెగా అభిమానులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


చరణ్ బర్త్ డేకి బన్నీ ట్వీట్ కూడా చేయలేదు!  
అల్లు అర్జున్ బర్త్ డే కంటే కొన్ని రోజుల ముందు రామ్ చరణ్ పుట్టినరోజు జరిగింది. అప్పుడు విషెష్ చెబుతూ బన్నీ ట్వీట్ కూడా చేయలేదు. అయినా సరే నిన్న రామ్ చరణ్ విషెష్ చెప్పారు. ఆయనకు కూడా బన్నీ లేటుగా రిప్లై ఇచ్చారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలను సైతం అభిమానులు గమనిస్తున్నారు. బన్నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నా సరే... మెగా ఫ్యామిలీ సంస్కారం చూపిస్తూ వస్తోందని సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. 


అల్లు అర్జున్ ఫోటో పోస్ట్ చేయని చరణ్!
అఖిల్ అక్కినేని పుట్టినరోజు కూడా శనివారమే. అతడికీ విషెస్ చెబుతూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అఖిల్ (Akhil Akkineni)తో దిగిన ఫోటో పోస్ట్ చేసి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే, అల్లు అర్జున్ ఫోటో కూడా పోస్ట్ చేయలేదు. ఇంస్టాగ్రామ్ విషయానికి వస్తే స్టోరీల్లో బన్నీ బర్త్ డే పోస్ట్ లేదు. ఓన్లీ అఖిల్ అక్కినేనిది మాత్రమే ఉంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాయింట్ అవుట్ చేస్తున్నారు.


Also Read : హీరోయిన్లకు చీర, జాకెట్ తప్ప ఇంకేమీ ఉండదు -  'శ్రీదేవి చిరు' పాటపై శృతి సెటైర్స్


అల్లు అర్జున్ పుట్టినరోజు సాక్షిగా మరోసారి 'మెగా' ఫ్యామిలీలో యంగ్ హీరోల మధ్య విబేధాలు బయట పడ్డాయని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. బహుశా... చిరంజీవికి అల్లు అర్జున్ నేరుగా ఫోన్ చేసి ఉండొచ్చు. రామ్ చరణ్, ఆయన మాట్లాడుకుని ఉండొచ్చు. అటువంటి విషయాలు అభిమానులకు తెలియవు కదా! దాంతో మాటల యుద్ధం మొదలైంది.  


Also Read మళ్ళీ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ - 'ఉస్తాద్' సెట్స్ నుంచి లీకైన లుక్ చూశారా?