Ante Sundaraniki Movie Update: నాని (Nani) కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'. ఇందులో మలయాళ కథానాయిక నజ్రియా ఫహాద్ (Nazriya Fahadh) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆమె లుక్ (Nazriya Fahadh first look - Ante Sundaraniki Movie) విడుదల చేశారు. క్యారెక్టర్ ఏంటనేది కూడా రివీల్ చేశారు.


'అంటే సుందరానికీ' సినిమాలో మిస్ లీలా థామస్ పాత్రలో నజ్రియా ఫహాద్ నటిస్తున్నట్టు తెలిపారు. ఆమె ఫొటోగ్రాఫర్ రోల్ చేస్తున్నట్టు (Nazriya Fahadh role in Ante Sundaraniki revealed) వెల్లడించారు. హీరోయిన్ పేరును బట్టి ఆమె క్రిస్టియన్ అనేది అర్థమవుతోంది. లుక్‌తో పాటు విడుదల చేసిన వీడియో చూస్తే... ఆమె చేసిన ప్రేయర్ బట్టి క్రిస్టియన్ అనేది కన్ఫర్మ్ చేయవచ్చు. సినిమాలో హీరో ఏమో బ్రాహ్మిణ్. వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా జరిగింది? ఆ తర్వాత ఏమైంది? అనేది తెలియాలంటే... మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Also Read: 'జేమ్స్‌' రివ్యూ: పవర్ స్టార్ ఆఖరి సినిమా ఎలా ఉంది?






'అంటే సుందరానికీ' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మిస్తున్నారు. జూన్ 10న  సినిమాను (Ante Sundaraniki Movie Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు నాని పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.


Also Read: 'ద కశ్మీర్ ఫైల్స్'కు కుమారి 'నో' - సినిమాపై సంచలన వ్యాఖ్యలు