Amala Paul Second Marriage : తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన మలయాళ భామ అమలా పాల్. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'బెజవాడ' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆమె పరిచయం అయ్యారు. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'నాయక్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఇప్పుడీ అందాల భామ ప్రస్తావన ఎందుకు అంటే... రెండో పెళ్లికి ఆమె రెడీ అయ్యారు. 


అమలా పాల్ పెళ్లి చేసుకోబోయేది ఎవరంటే?
Amala Paul 2nd Husband Name : ఈ రోజు అమలా పాల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఒక పబ్బులో సెలబ్రేట్ చేసిన జగత్ దేశాయ్ (Jagat Desai)... ఆమె ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచారు. అందుకు అమలా పాల్ సంతోషంగా ఓకే చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు జగత్ దేశాయ్! ''నా రాణి 'ఎస్' చెప్పింది. పెళ్లి గంటలు మోగుతున్నాయి. హ్యాపీ బర్త్ డే మై లవ్'' అని ఆయన పేర్కొన్నారు.






జగత్ దేశాయ్ ఎవరు?
ఎవరీ జగత్ దేశాయ్? అమలను పెళ్లి చేసుకోబోయేది ఎవరు? అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశం అయ్యింది. అతడి గురించి ఆరాలు తీయడం మొదలు పెట్టారు. జగత్ దేశాయ్ ప్రొఫైల్ చూస్తే... సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తిగా కనిపించడం లేదు. అమలా పాల్ ఫోటో తప్ప గతంలో పరిశ్రమ ప్రముఖుల ఫోటోలు ఏవీ లేవు. అయితే... తొమ్మిది వారాల క్రితం అమలాతో సన్నిహితంగా దిగిన ఫోటో షేర్ చేసిన జగత్ దేశాయ్... లవ్ సింబల్ ఎమోజీ జోడించారు. వీరిద్దరి మధ్య కొన్నాళ్ల క్రితమే ప్రేమ చిగురించినట్లు అర్థం అవుతోంది. 


మూడేళ్ళకు విజయ్, అమలా పాల్ విడాకులు
కథానాయికగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన మూడు సంవత్సరాలకు అమలా పాల్ వివాహం చేసుకున్నారు. విక్రమ్ 'నాన్న' (తమిళంలో 'దైవ తిరుమగల్')లో ఆమె నటించారు. ఆ సినిమా చిత్రీకరణ చేసేటప్పుడు దర్శకుడు ఏఎల్ విజయ్, అమలా పాల్ ప్రేమలో పడ్డారు. వాళ్లిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే... మూడేళ్లకు విడాకులు తీసుకున్నారు. 


Also Read : కొత్త ఇంటిలోకి కాజల్ అగర్వాల్ - ముంబైలో మరో ఖరీదైన ఫ్లాట్!


సినిమాల్లో నటించవద్దని అత్తమామలు కండిషన్స్ పెట్టడంతో ఏఎల్ విజయ్ నుంచి అమలా పాల్ విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. వైవాహిక బంధం నుంచి వైదొలిగిన తర్వాత అమలా పాల్ మరో పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఓ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన మమ్ముట్టి 'క్రిస్టోఫర్'లో అమలా పాల్ నటించారు. హిందీలో అజయ్ దేవగణ్ 'భోళా' (కార్తీ ఖైదీ రీమేక్)లో ప్రత్యేక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం రెండు మలయాళ సినిమాల్లో అమలా పాల్ నటిస్తున్నారు. 


Also Read చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial