కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తెలుగు తెర చందమామ! ఇటీవల 'భగవంత్ కేసరి' సినిమాలో కాత్యాయని పాత్రలో ఆమె సందడి చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు జోడీగా తొలిసారి నటించారు.


'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ నిడివి తక్కువ. కానీ, ఆమె కొంత విరామం తర్వాత వెండితెరపై సందడి చేయడంతో అభిమానులు చాలా సంతోషించారు. అయితే ఒక్క విషయం గమనించారా? 'అన్‌స్టాపబుల్' లిమిటెడ్ ఎడిషన్ షో... అంతకు ముందు రెండు మూడు కార్యక్రమాల్లో తప్ప కాజల్ ఎక్కువ కనిపించలేదు. ఎందుకో తెలుసా?


కొత్త ఇంటిలోకి కాజల్ అగర్వాల్!
కాజల్ అగర్వాల్ కొత్త ఇంటిలోకి అడుగు పెడుతున్నారు. అవును... ముంబైలో ఓ ఖరీదైన భవంతిలోకి ఆమె ఫ్యామిలీ వెళుతోంది. సొంతింటి గృహ ప్రవేశం ఉండటంతో 'భగవంత్ కేసరి' ప్రచార కార్యక్రమాలకు కాజల్ హాజరు కాలేదు. అదీ సంగతి!


అదేంటి? ముంబైలో ఇన్నాళ్ళు కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal New House)కు సొంత ఇల్లు లేదా? అని కొందరికి సందేహం రావచ్చు. ముంబైలో కాజల్ తల్లిదండ్రులకు సొంత ఇల్లు ఉంది. ఆమె భర్త గౌతమ్ కిచ్లూ ఫ్యామిలీకి కూడా ఇల్లు ఉంది. అయితే... ఇప్పుడు కొత్త ఫ్లాట్ మరొకటి కొన్నారు. బహుశా... అబ్బాయి నీల్ కిచ్లూ జన్మించడం, పిల్లాడు పెద్దవాడు అవుతూ ఉండటంతో కాజల్, గౌతమ్ కిచ్లూ మరొక ఫ్లాట్ కొనుక్కుని షిఫ్ట్ అవుతున్నారేమో!?


'భగవంత్ కేసరి'లో క్యారెక్టర్ గురించి ముందే తెలుసా?
'భగవంత్ కేసరి' పేరు చెబితే ముందుగా బాలకృష్ణ, ఆ తర్వాత శ్రీ లీల క్యారెక్టర్లు గుర్తుకు వస్తాయి. అతిథిలా కాజల్ తళుక్కున మెరిశారని కొందరు ప్రేక్షకులు కామెంట్ చేశారు. అయితే... ఆమెకు తన పాత్ర గురించి ముందుగా ఐడియా ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి మాటలను బట్టి అర్థం అవుతోంది.


Also Read : వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థంలో చిరంజీవి, మహేష్ బాబు సందడి


ఇటీవల 'భగవంత్ కేసరి' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. అప్పుడు ''కాత్యాయని పాత్ర చేసిన కాజల్ కు థాంక్స్. సినిమాలో పాత్రకు ఆమెను అనుకున్నప్పుడు... ఆవిడకు ఈ క్యారెక్టర్ పెద్దగా ఉపయోగపడదని తెలుసు. ఆమెకు ఓపెన్ గా చెప్పా. మా కోసం ఈ రోల్ చేయమని అడిగా. స్త్రీ సాధికారిత మీద తీసిన సినిమా. లేడీస్ గురించి కాజల్ వంటి స్టార్ చెబితే బావుంటుందని అడిగితే ఓకే చెప్పి చేసినందుకు ఆమెకు థాంక్స్'' అని అనిల్ రావిపూడి చెప్పారు. దాంతో బాలకృష్ణ, అనిల్ రావిపూడి కోసం ఆమె 'భగవంత్ కేసరి' చేశారని అర్థం అవుతోంది. 


Also Read చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్



నిజం చెప్పాలంటే... మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ జరగాలి. అయితే... కొన్ని రోజులు షూటింగ్ చేసినప్పటికీ చివరకు సినిమాలో ఆమె రోల్ తొలగించారు. దాంతో 'భగవంత్ కేసరి' రీ ఎంట్రీ అయ్యింది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial