'మంగళవారం' సినిమాపై ముందు నుంచి అంచనాలు బావున్నాయి. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఫస్ట్ లుక్ విడుదల తర్వాత ప్రేక్షకుల చూపు పడింది. టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదల తర్వాత ఆ అంచనాలను మరింత పెంచారు దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). దాంతో డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం డిమాండ్ ఏర్పడింది. ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి వెళుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే...
'ఆర్ఎక్స్ 100'తో తెలుగు చిత్రసీమలో కొత్త ఒరవడి సృష్టించిన అజయ్ భూపతి... ఆ సినిమా తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా 'మహాసముద్రం' తీశారు. తొలి సినిమా స్థాయిలో రెండో సినిమా విజయం సాధించలేదు. కానీ, అజయ్ భూపతి మేకింగ్ స్టైల్ & దర్శకత్వానికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం' (Mangalavaram Movie). ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 17న సినిమా విడుదల కానుంది.
ఆంధ్ర & సీడెడ్ రైట్స్ @ 8 కోట్లు
'మంగళవారం' టీజర్ విడుదలైన తర్వాత ఆంధ్ర & సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 7.20 కోట్లకు అమ్మేశారు. అప్పటికి ఇదొక హారర్ సినిమా అనే ఫీల్ కలిగింది అంతే! పైగా, పాయల్ బోల్డ్ లుక్ కూడా బిజినెస్ జరగడానికి కారణమైంది. 'మంగళవారం' ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని, బోల్డ్ సీన్స్ మాత్రమే కాదు... అంతకు మించి కంటెంట్ ఉందని బలమైన నమ్మకం ప్రేక్షకుల్లో, పరిశ్రమ వర్గాల్లో కలిగింది. దాంతో సినిమాకు ఇంకా హైప్ వచ్చింది.
Also Read : చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్
ఇప్పుడు 'మంగళవారం' ఆంధ్ర ఏరియా రైట్స్ మాత్రమే ఆరు కోట్ల రూపాయల వరకు చెబుతున్నారు. డీల్ దాదాపు క్లోజ్ అయినట్లే! సీడెడ్ హక్కుల ద్వారా మరో రెండు కోట్ల రూపాయలు రావచ్చని టాక్. ఈ డీల్స్ నిర్మాత చేయడం లేదు. ఆల్రెడీ ఆంధ్ర & సీడెడ్ రైట్స్ కొన్న వ్యక్తులు చేస్తున్నారు. అంటే... విడుదలకు ముందు వాళ్ళకు మంచి లాభం వచ్చినట్లే! నైజాం రైట్స్ ఎంత పలుకుతాయో చూడాలి.
Also Read : జైల్లో రజనీకాంత్ 'జైలర్' విలన్ వర్మ అలియాస్ వినాయకన్ - మద్యం మత్తులో గొడవ గొడవ
'మంగళవారం' చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి ఆ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, కూర్పు : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్ - రాఘవ్, కళా దర్శకత్వం : మోహన్ తాళ్లూరి, ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్ - పృథ్వీ, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అజయ్ భూపతి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial