బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' మూవీ థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఓ స్పెషల్ నోట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ స్పెషల్ నోట్ నెట్టింట వైరల్ అవుతుంది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ అంశాలను మేళవిస్తూనే ఓ సోషల్ మెసేజ్ ను ఈ సినిమాతో ప్రేక్షకులకు అందించారు అనిల్ రావిపూడి.
సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో తెలుగు వెండితెరకి నటుడిగా పరిచయమయ్యారు. స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నారు. బాలయ్య కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ అందుకున్న 'భగవంత్ కేసరి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న క్రమంలో మూవీ టీం ఇప్పటికే సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించింది. ఇక తాజాగా సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరి మూవీకి సంబంధించి ఓ స్పెషల్ నోట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"భగవంత్ కేసరి పై తమ ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. మా టీం మొత్తానికి థాంక్స్. అనిల్ రావిపూడి మీరు చాలా ప్రతిభావంతులు. మీరు గిఫ్టేడ్. సాహు గారపాటి నన్ను నమ్మి నాకు ఎంతో మద్దతుగా నిలబడ్డారు. సెట్ లో చాలా టాలెంటెడ్ ఫన్ పర్సన్ అయిన శ్రీలీలతో మంచి టైం స్పెండ్ చేశాను. కాజల్ అగర్వాల్ మన సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అలాగే సినిమా యూనిట్ మొత్తం అద్భుతమైన భోజనాలు, ప్రేమ అందించినందుకు థ్యాంక్స్. అలాగే తమన్ కి కూడా థ్యాంక్స్. ముఖ్యంగా నాకు అందించిన ఒక అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ నన్ను చాలా ఆకట్టుకుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ బ్రో కి.. మీరు చాలా స్పెషల్.. ఐ కేర్ బ్రదర్, ఐ లవ్ యు" అంటూ రాస్కొచ్చారు.
'నాతో ఉన్నందుకు నా టీం శ్రీనివాస్, నవీన్, లక్ష్మణ్ కి కూడా థాంక్స్' అని తన స్పెషల్ నోట్ లో పేర్కొన్నారు అర్జున్ రాంపాల్. దీంతో అర్జున్ రాంపాల్ షేర్ చేసిన ఈ స్పెషల్ నోట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరోవైపు 'భగవంత్ కేసరి' మూవీ కేవలం ఆరు రోజుల్లోనే రూ.104 కోట్ల గ్రాస్ అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి సినిమాల తర్వాత 'భగవంత్ కేసరి'తో మరో రూ.100 కోట్ల హిట్ అందుకున్నారు బాలయ్య. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోల తర్వాత వరుసగా మూడు సినిమాలతో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఏకైక సీనియర్ హీరోగా బాలయ్య నిలవడం విశేషం.
Also Read : ప్రభాస్‌ను పక్కన పెట్టి, షారుక్‌కు సపోర్ట్ చేస్తున్న దిల్ రాజు