Ravi Teja Gopichand Malineni Movie Update : మాస్ మహారాజా రవితేజ, యువ దర్శకుడు గోపీచంద్ మలినేనిలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్! వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. రవితేజ 'డాన్ శీను' సినిమాతోనే గోపీచంద్ మలినేని దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తన తొలి సినిమా హీరోతో 'బలుపు', 'క్రాక్' సినిమాలు చేశారు. ముచ్చటగా మూడు విజయాల తర్వాత నాలుగో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. 


రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్న తాజా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. 'వీర సింహా రెడ్డి' విజయం తర్వాత ఆ సంస్థలో గోపీచంద్ మలినేని చేస్తున్న చిత్రమిది. ఇందులో ఓ ప్రధాన పాత్రకు తమిళ దర్శకుడిని తీసుకున్నారు. 


రవితేజ సినిమాలో సెల్వరాఘవన్!
Selvaraghavan on board for Ravi Teja Movie : రవితేజ, గోపీచంద్ మలినేని చేస్తున్న తాజా సినిమాలో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ కీలక పాత్ర చేస్తున్నట్లు ఈ రోజు వెల్లడించారు. కొన్నేళ్ల పాటు ప్రేక్షకులు అందరికీ ఆ క్యారెక్టర్ గుర్తు ఉంటుందన్నారు.


Also Read చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్






రవితేజ, గోపీచంద్ కలయికలో తమన్ హ్యాట్రిక్ 
'కిక్', 'మిరపకాయ్', 'ఆంజనేయులు'... చెబుతూ వెళితే రవితేజ, తమన్ కలయికలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే... రవితేజ, గోపీచంద్ మలినేని, తమన్ కలయికలో 'బలుపు', 'క్రాక్' వచ్చాయి. ఇప్పుడీ సినిమా హీరో అండ్ దర్శకుడితో తమన్ హ్యాట్రిక్.


Also Read జైల్లో రజనీకాంత్ 'జైలర్' విలన్ వర్మ అలియాస్ వినాయకన్ - మద్యం మత్తులో గొడవ గొడవ






కథానాయికగా రష్మిక ఉంటారా? మరొకరు వస్తారా?
ఈ సినిమాలో కథానాయికగా నేషనల్ క్రష్ నటించనున్నట్లు ఆ మధ్య ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. ఇప్పటి వరకు రవితేజ, రష్మిక మందన్నా కలిసి సినిమా చేయలేదు. అందువల్ల, వాళ్ళ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. పైగా, రష్మికకు నార్త్ ఇండియాలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆల్రెడీ హిందీ సినిమాలు చేశారు. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'లో కూడా ఆమె కథానాయిక. రష్మిక హీరోయిన్ అయితే బాలీవుడ్ మార్కెట్, హిందీ శాటిలైట్ అండ్ ఓటీటీకి కూడా హెల్ప్ అవుతుంది. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial