Amala Paul: కొడుకుని క్రైస్తవ మతంలోకి మార్చిన అమలాపాల్ - వైభవంగా వేడుక.. ఫోటోలు చూశారా?
Amala Paul Son: హీరోయిన్ అమలాపాల్ తన కొడుకుని క్రైస్తవ మతంలోకి మార్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Amala Paul's Son Converted To Christianity: హీరోయిన్ అమలాపాల్.. తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గరి నుంచి నేచురల్ స్టార్ నాని వరకూ దాదాపు అందరు హీరోలతోనూ నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ మూవీస్ చేసి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు
కుమారునికి క్రైస్తవంలోకి మార్పు
Just In
సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోస్‌తో పాటు ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటుంటారు అమలాపాల్. తాజాగా.. తన కుమారునికి మతం మార్చారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ.. 'ప్రేమ, శాంతితో కూడిన ఇలై బాప్టిజం జరుపుకొన్నాడు.' అంటూ రాసుకొచ్చారు. 'బాప్టిజం' అంటే క్రైస్తవ మతంలోకి మారడం. ఈ విషయాన్నే షేర్ చేస్తూ ఆమె ఫోటోలను పంచుకోగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నెటిజన్ల రియాక్షన్
ఇది చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అమలాపాల్ కుమారుడు చాలా క్యూట్‌గా, యువరాజులా ఉన్నాడంటూ ప్రశంసిస్తున్నారు. ఆమెకు విషెష్ చెబుతూ.. కొత్త జర్నీ పీస్, హ్యాపీనెస్‌తో నిండిపోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
సినిమాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అమలాపాల్ రియల్ లైఫ్‌లో మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. 2014లో తమిళ డైరెక్టర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు అమలాపాల్. ఆ తర్వాత 2017లో అనుకోని కారణాలతో వివాహ బంధానికి ముగింపు పలికారు. కొన్నేళ్ల పాటు ఒంటరిగా మూవీస్ చేసిన తర్వాత 2023లో బిజినెస్ మ్యాన్ జగత్ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2024 జూన్ 11న మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే బిడ్డను చూసుకుంటున్నారు. తాజాగా.. 'ఇలాయ్'ను క్రైస్తవ మతంలోకి మార్చారు.
Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీకి డిఫరెంట్ టైటిల్ - అంత మంది హీరోయిన్లా?, అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..
ఆయనకు హీరోయిన్ అని తెలీదు
తాజాగా JFW మూవీ అవార్డు వేడుకలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న అమలాపాల్.. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి. జగత్ దేశాయ్ తాను గోవాలో కలుసుకున్నామని.. ఆయన సౌత్ సినిమాలు పెద్దగా చూడడు కాబట్టి తాను హీరోయిన్ అని తెలియదని చెప్పారు. 'పెళ్లి తర్వాత హీరోయిన్ అని చెప్పడంతో షాక్ అయ్యారు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో నా మూవీస్ ఒక్కొక్కటిగా చూస్తూ ఎంజాయ్ చేశారు. పెళ్లికి ముందే ఇద్దరం కలవడంతో ప్రెగ్నెంట్ అయ్యాను. కొద్ది రోజుల తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యా.' అని చెప్పారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. అమలాపాల్ తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ మూవీస్ చేశారు. రామ్ చరణ్‌తో 'నాయక్', బన్నీతో 'ఇద్దరమ్మాయిలతో', నాగచైతన్యతో 'బెజవాడ', నానితో 'జెండాపై కపిరాజు' మూవీస్‌లో నటించారు. గతేడాది సైకలాజికల్ థ్రిల్లర్ 'లెవల్ క్రాస్'లో నటించారు.