Ram Charan New Look In Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తోన్న అవెయిటెడ్ మూవీ 'పెద్ది'. ఇప్పటికే చరణ్ లుక్స్, పోస్టర్స్, గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించగా కొత్త షెడ్యూల్ కోసం చరణ్ డిఫరెంట్ లుక్‌లోకి మారుతున్నారు. ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా ఓ స్పోర్ట్స్ పర్సన్‌లా మాస్ రగ్గడ్ లుక్‌లో ఆయన అదరగొట్టారు.
'పెద్ది' మూవీ కోసం తాను వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుపుతూ రామ్ చరణ్ ఓ ఫోటో షేర్ చేయగా వైరల్ అవుతోంది. గుబురు గెడ్డంతో ఓ కోచ్ లేదా స్పోర్ట్స్ పర్సన్ అన్నట్లుగా ఆయన లుక్ ఉంది. 'పెద్ది కోసం ఇలా మారుతున్నాను. దృఢ సంకల్పం... గొప్ప ఆనందం.' అంటూ రాసుకొచ్చారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. గ్లింప్స్‌లో సిగ్నేచర్ షాట్, ఊర మాస్ డైలాగ్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. బీజీఎం మూవీకే హైలైట్‌గా నిలవగా... చరణ్ రోల్ ఏంటనే దానిపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read: ఉత్తరాంధ్రలో వీరమల్లు రికార్డ్... నో డౌట్, పవన్ మేనియా చూస్తేంటే వసూళ్ల ఊచకోత గ్యారెంటీ
ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కీలక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. చరణ్ 16వ చిత్రంగా మూవీ రూపొందుతోంది. హైదరాబాద్‌లోనే ఇటీవల షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఎవరూ చేయని హై రిస్క్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్లు సమాచారం. కొత్త షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లపై లవ్ రొమాంటిక్ సీన్స్, టాకీ పార్ట్ తీయాలని భావిస్తున్నారట.
మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే గౌర్నాయుడుగా పవర్ ఫుల్ పాత్రలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ నటించనున్నారు. ఇటీవలే ఆయన లుక్ రివీల్ చేయగా ఆకట్టుకుంటోంది. అలాగే, రామ్ బుజ్జిగా 'మీర్జాపూర్' ఫేం దివ్యేందు శర్మ కీ రోల్ ప్లే చేస్తున్నారు. జగపతిబాబు, అర్జున్ అంబటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సతీష్ కిలారు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయనున్నారు.
బిగ్ ఓటీటీ డీల్
ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే ఓటీటీ డీల్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా... అన్నీ భాషలకు కలిపి ఓటీటీ డీల్ రూ.110 కోట్లు అని తెలుస్తోంది.