'హరి హర వీరమల్లు' విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. థియేటర్లలో స్టార్ హీరోని నటించిన సినిమా వచ్చి కొంత గ్యాప్ వచ్చింది. సమ్మర్‌లో సరైన సినిమా విడుదల కాలేదు. మన తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో వీరమల్లు విడుదల అవుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే...
150 థియేటర్లలో 135 వీరమల్లుకు!ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొత్తం 150 స్క్రీన్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ కౌంట్ ఇది. ఆ 150లో 135 స్క్రీన్లలో హరిహర వీరమల్లు సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ఏరియాలో ఏ స్థాయిలో ఏ సినిమా కూడా విడుదల కాలేదు. కేవలం 15 స్క్రీన్లు మాత్రమే ఇతర సినిమాలకు కేటాయించారు.
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో, ఆ మాటకు వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో ఇది భారీ రిలీజ్. మొదటి వారం ఉత్తరాంధ్ర అంతటా 125 స్క్రీన్లలో పవన్ కళ్యాణ్ సినిమా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. సో, మొదటిరోజు ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించడం గ్యారంటీ. ఫస్ట్ డే ఓపెనింగ్ నుంచి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వరకు బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప రికార్డులను అధిగమించే అవకాశం సినిమాకు ఉంది మొదటి రోజు టాక్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది.
టాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ లిస్టులో 3?హరిహర వీరమల్లు సినిమాను నైజాం ఏరియాలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేస్తుంది. ఉత్తరాంధ్రలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. మిగతా ఏరియాలలోనూ వీరమల్లును భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ లెక్కల విషయానికి వస్తే... రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి 2', గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాల పేరిట రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఆ టాప్ 3, టాప్ 4 ప్లేసుల్లో 'హరి హర వీరమల్లు' ఉండటం గ్యారెంటీ. జూలై 24న సినిమా విడుదల కానుంది. దానికి ముందు రోజు జూలై 23వ తేదీ రాత్రి భారీ ఎత్తున ప్రీమియర్లు వేయడానికి ఏర్పాట్లు జరిగాయి. సో రికార్డ్స్ మీద అందరి చూపు పడుతోంది.