Hari Hara Veera Mallu Pre Release Event Full Details: 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది ఈ రోజే (అంటే జూలై 21వ తేదీ సాయంత్రం). ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈవెంట్ కంటే ముందు పవన్ మీడియా ముందుకు వస్తున్నారు. అది పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఎక్కడ? ఎవరెవరు వస్తున్నారు? సాయంత్రం ఎన్ని గంటలకు మొదలు అవుతుంది? వంటి వివరాలు తెలుసుకోండి.
వేడుకలో నలుగురు దక్షిణాది మంత్రులు!List of ministers attending Hari Hara Veera Mallu event: 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ వేడుకకు నలుగురు దక్షిణాది మంత్రులు హాజరు అవుతారు. సినిమాలో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. ఆయనతో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం వీరమల్లు వేడుకకు హాజరు అవుతారు.
ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖులకు సైతం 'హరి హర వీరమల్లు' నిర్మాత ఏయం రత్నం ఆహ్వానాలు అందించారు. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిష్టర్ ఈశ్వర్ ఖండ్రే, అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సైతం వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కానున్నారు.
దర్శక ధీరుడితో పాటు మాటల మాంత్రికుడు!Who is chief guest of Veeramallu pre release event?: రాజకీయ ప్రముఖులను పక్కన పెడితే... సినిమా ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, తెలుగు సినిమా స్థాయిని పెంచిన - తెలుగు భాషకు గౌరవం తెచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం హాజరు కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం వీరమల్లు వేడుకకు హాజరు అవుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అందులో నిజం లేదు. మెగా ఫ్యామిలీ కనిపించే అవకాశం తక్కువ.
వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్, దర్శకుడు జ్యోతి కృష్ణ, నిర్మాత ఏయం రత్నం, సంగీత దర్శకుడు - ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సహా చిత్ర బృందంలో ముఖ్యులు హాజరు అయ్యే అవకాశం ఉంది.
పవన్ వీరమల్లు ప్రీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ?HHVM pre release event date and time: హైదరాబాద్ సిటీలోని శిల్పకళా వేదికలో 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. యువి మీడియా సంస్థ ఈవెంట్ చేస్తోంది. ఆర్గనైజర్స్ వాళ్ళే. ఆల్రెడీ పాసులు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ రోజు (జూలై 21వ తేదీ) సాయంత్రం ఆరు గంటల నుంచి వేడుక మొదలు అవుతుంది. పాసులు ఉన్న అభిమానులు మాత్రమే రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది. గతంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్ వస్తున్నారంటే పాసులు లేకున్నా ఏదో రకంగా ఆయన్ను చూడవచ్చని వచ్చే అభిమానులు ఎక్కువ. అభిమాన గణం పోటెత్తితే భద్రతాపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి వాటికి తావు ఇవ్వకూడదని చిత్ర బృందం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.