Zee Telugu New Serials 2025: తెలుగు ప్రజలు మెచ్చే సీరియల్స్ అందిస్తున్న టాప్ టీవీ ఛానళ్లలో 'జీ తెలుగు' ఒకటి. ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. టీఆర్పీలో తన ఉనికి చాటుతోంది. ఇప్పుడీ ఛానల్‌లో 2025లో ప్రారంభమైన కొత్త సీరియళ్లలో 'జయం' (Jayam Serial On Zee Telugu) ఒకటి.
'జయం'లో హీరో హీరోయిన్లు ఎవరు?ఇంతకు ముందు వాళ్ళు ఏం చేశారు?Jayam Zee Telugu Serial Cast And Crew: జీ తెలుగు ఛానల్ ఇటీవల శుభం కార్డు వేసిన సీరియల్ 'ప్రేమ ఎంత మధురం' గుర్తుందా? అందులో హీరోగా నటించిన శ్రీరామ్ వెంకట్ (Prema Entha Madhuram fame Sriram Venkat)!? 'జయం' సీరియల్‌లో ఆయన హీరో. ఆయన సరసన కన్నడ అమ్మాయి వర్షిణి గౌడ (Varshini Gowda) నటిస్తున్నారు. 'జయం' సీరియల్‌కు వెంకట్ దర్శకుడు.
'జయం'లో రుద్ర ప్రతాప్ పాత్రలో కేవీ శ్రీరామ్, గంగావతి పాత్రలో వర్షిణి సందడి చేయనున్నారు. సీనియర్ నటుడు, పలు సినిమాల్లోనూ సందడి చేసిన విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. ఆయన ప్రసాద్ బాబు పాత్ర చేస్తున్నారు. వీరితో పాటు శ్రీప్రియ, సరస్వతి, రాఘవ, రామస్వామి, సంగీత, సుభాష్, వరలక్ష్మి, యశ్వంత్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.
'జయం' సీరియల్ టెలికాస్ట్ టైమింగ్స్...ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుంది?Zee Telugu New Serial Jayam Telecast Timings: జూలై 14, 2025న 'జయం' ప్రారంభమైంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. దీని కోసం వేరే సీరియల్స్ టైమింగ్స్ కూడా మార్చారు. ఇప్పుడు 'చామంతి' సీరియల్ రాత్రి 8:30 గంటలకు, 'జగధ్దాత్రి' సీరియల్ రాత్రి 9:00 గంటలకు సోమ నుంచి శుక్రవారం ప్రసారం అవుతాయి.
శ్రీరామ్ వెంకట్ హోమ్ ప్రొడక్షన్ హౌస్ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సీరియల్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది.
'జయం' కథ, అందులో ఎవరి క్యారెక్టర్ ఏమిటి?Sriram Venkat Character In Jayam Serial Reveled: రుద్ర ప్రతాప్ ఒక మాజీ బాక్సర్. అతని గతమంతా గాయాలే. జీవితంలో సోదరుడి మరణం అతని మనసును బాధ పెడుతుంటుంది. ఆ జ్ఞాపకాలతో, విషాదం నిండిన గతంతో ప్రస్తుతం బాక్సింగ్ కోచ్‌గా తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇక గంగావతి విషయానికి వస్తే... ఆమెది పేద కుటుంబం. బాధ్యత లేని తండ్రి, అనారోగ్యానికి గురైన తల్లి... దాంతో కుటుంబ బాధ్యతలను తన భుజాన వేసుకుంటుంది గంగావతి.
ఓ ఊహించని సంఘటన వల్ల రుద్ర ప్రతాప్, గంగావతి ఒక్కటి అవుతారు. ఒకరి సవాళ్లను మరొకరు అర్థం చేసుకుంటూ... జీవితంలో ముందుకు ఎలా ప్రయాణం చేశారు? అనేది సీరియల్ చూసి తెలుసుకోవాలి. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న 'జయం'లో సమాజంలోని పేదరికం, మనుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి వంటి అంశాలను స్పృశిస్తూ వీక్షకులలో స్ఫూర్తి నింపేలా సీరియల్ ఎపిసోడ్స్ సాగుతాయట.