రెంట్ పద్ధతిలో థియేటర్లు ఇవ్వమని, తమకు పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. డిస్ట్రిబ్యూటర్లు అందుకు ఓకే అనలేదు. ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య మొదలైన గొడవ ఇప్పుడు టాలీవుడ్ పెద్దల మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసే వరకు వెళ్ళింది. దీని వెనుక వైసీపీ నాయకుడు ఉన్నారా? అంటే 'అవును' అని ఆఫ్ ది రికార్డు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతోంది.
వైసీపీ మొదలుపెట్టిన ఆటలో 'ఆ నలుగురు' పావులుగా మారారా? కలసి కూర్చుని డిస్కస్ చేస్తే తీరిపోయే సమస్యను ఇప్పుడు పీకల మీదకు తెచ్చుకున్నారా? అంటే 'అవును' అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
థియేటర్స్ బంద్ వెనుక ద్వారంపూడి!?ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదలు అయ్యింది. ఏప్రిల్ మూడో వారంలో అక్కడ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఒక సమావేశం జరిగింది. అందులో సయోధ్య కుదరలేదు. దాంతో చూడు ఒకటి నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడి నుంచి నైజాం ఎగ్జిబిటర్స్ వరకు ఆ ఫైర్ వచ్చింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని థియేటర్లలో మెజారిటీ వైసీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధీనంలో ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో ఒకరు, స్టూడియోలతో పాటు డిస్టిబ్యూషన్ సెక్టార్‌లోనూ కీలకంగా ఉన్న వ్యక్తితో ద్వారంపూడికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ పరంగా పార్టనర్స్ అని టాక్. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సదరు నిర్మాతకు కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలో కోల్పోవలసి వచ్చింది. దాంతో ఆయనకు కూటమి ప్రభుత్వం మీద కోపం ఉందట. దాంతో మెల్లగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక సమావేశం నిర్వహించి... ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ గొడవ క్రియేట్ చేసి, ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటికీ దాన్ని అప్లై చేసేలా చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్రసీమకు అనుకూలంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో అక్కినేని నాగార్జునకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన కలిసిన వారిలో నాగార్జున ఒకరు. అయినా సరే కూటమి ప్రభుత్వం అక్కినేని నాగచైతన్య 'తండేల్' విడుదల సమయంలో టికెట్ రేట్స్ పెంచడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. తమకు మద్దతు ఇవ్వని వారికి సైతం మద్దతు తెలిపింది. ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగలేదు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు చిత్రసీమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. సినిమా ప్రముఖుల మీద జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు. కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం కావాలంటే... పరిశ్రమలో గొడవ ఏర్పడేలా చేయాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. అందుకని కావాలని పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' విడుదలకు ముందు వివాదాన్ని పెంచి పెద్ద చేసిందని టాక్.
'సీజ్ ద షిప్' డైలాగ్ గుర్తు ఉందా? బియ్యం స్మగ్లింగ్ కేసులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆరోపణలు చేశారు. ఇప్పుడీ థియేటర్స్ బంద్ గొడవలో ఆయన మీద కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైకి థియేటర్స్ గొడవ కింద కనిపించినా... తెర వెనుక రాజకీయాలు ఉన్నాయని వినికిడి. అందుకే బన్నీ వాసు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు లోతుగా, సైలెంట్‌గా ఉంటాయని ట్వీట్ చేశారేమో!?
Also Read: మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు? తెర వెనక కుట్రలా... ఇండస్ట్రీలో ఏం జరుగుతోందా?
ప్రభాస్ కల్కి, అల్లు అర్జున్ పుష్ప, అక్కినేని నాగచైతన్య తండేల్ సహా హీరోలు ఎవరనేది చూడకుండా అడిగిన వాళ్ళు అందరి సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం. హీరో కావడంతో నిర్మాతల కష్టాలు పవన్ కళ్యాణ్‌కు తెలుసు. పైగా డిస్ట్రిబ్యూషన్ చేసేది కూడా సినిమాలో ప్రొడ్యూస్ చేసే కొందరు నిర్మాతలు కావడంతో వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఎక్కువ షోలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో పాటు టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేశారు. ఇప్పుడు పవన్ సినిమా వచ్చేసరికి వివాదాలు రేపడంతో ఆయనకు ఆగ్రహం వచ్చింది. దాంతో చిన్న గొడవ కాస్త చిలికి చిలికి తుఫానుగా మారింది. థియేటర్స్ నిర్వహణపై తనిఖీలు చేయాలని పవన్ ఆదేశించే వరకు వెళ్ళింది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల నిర్వహణ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అధికారులు గనుక తనిఖీలు చేస్తే చాలా థియేటర్లు సమస్యల్లో పడతాయి. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నం తిరిగి తిరిగి సూత్రధారుల మెడకు చుట్టుకుంది.
Also Read: టాలీవుడ్ 'కింగ్ పిన్'కు పవన్ కళ్యాణ్ చెక్‌మేట్... చిన్న గూగ్లీకి హడల్... దెబ్బకు సెట్టయ్యారా?