Allu Arjun Atlee Movie Title Buzz Gone Viral: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ హైప్ మామూలుగా లేదు. ఈ మూవీ నుంచి ఏ చిన్న రూమర్, ఎలాంటి బజ్ వచ్చినా క్షణాల్లోనే ట్రెండ్ అవుతోంది. తాజాగా.. ఈ మూవీ టైటిల్‌పై ఆసక్తి నెలకొంది.
టైటిల్ అదేనా..
సమాంతర ప్రపంచం, పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌లో భారీ స్థాయిలో తెరకెక్కబోతోన్న ఈ మూవీ టైటిల్ ఏంటనే దానిపై అందరిలోనూ ఇంట్రెస్ట్ నెలకొంది. దీనిపై ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది. 'ఐకాన్', 'సూపర్ హీరో' అనే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా ప్లాన్ చేయగా కొన్ని కారణాలతో అది సాధ్యం కాలేదు. ఈ మూవీకి 'ఐకాన్' అనే టైటిల్ అనుకున్నారట. అట్లీ సినిమాకు ఆ టైటిల్ అయితే బాగుంటుందని బన్నీ చెప్పగా.. దీనికి ఆయన సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..
బన్నీతో హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని ప్లాన్ చేస్తుండగా.. దాదాపు ఐదుగురు హీరోయిన్లను తీసుకోవాలని అట్లీ భావిస్తున్నారట. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెతో పాటు అనన్య పాండే, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్‌లను తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
డ్యూయెల్ కాదు.. ట్రిపుల్ రోల్..
ఈ సినిమాలో మొన్నటి వరకూ బన్నీ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారనే టాక్ వినిపించగా.. తాజాగా ట్రిపుల్ రోల్ చేస్తారనే రూమర్ వినిపిస్తోంది. ఒకటి పాజిటివ్, మరొకటి నెగిటివ్, ఇంకొకటి పూర్తిగా యానిమేటెడ్‌గా ఉంటుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లోనే ఇదో అరుదైన ఫీట్ అనే చెప్పాలి.
షూటింగ్ ప్రారంభం
దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించనుండగా ఇటీవలే బన్నీతో అట్లీ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా.. ఆగస్టులోనే షూటింగ్ ప్రారంభించాలని అట్లీ ప్లాన్ చేస్తున్నారట. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. వీఎఫ్ఎక్స్‌తో హై ఆక్టేన్ ఫీచర్ ఫిల్మ్‌గా ఉండబోతోందని ఇదివరకే ప్రకటించారు. ఇందుకోసం ఓ అంతర్జాతీయ కంపెనీని కూడా సంప్రదించారు.
న్యూ లుక్‌లో బన్నీ
'పుష్ప 2' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఈ మూవీ కోసం బన్నీ డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. మూడు వేర్వేరు ప్రపంచాల్లో జరిగిన కథగా అట్లీ దీన్ని రూపొందించనున్నట్లు తెలుస్తుండగా.. దాని కోసం కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే నటీనటులు, రోల్స్‌కు సంబంధించి పూర్తి వివరాలను టీం వెల్లడించే ఛాన్స్ ఉంది.