Rishab Shetty's Kantara Chapter 1 Three Years Journey Glimpse Video: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా 2022లో వచ్చిన 'కాంతార' బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్‌తో నిర్మించి చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు మూవీకి ప్రీక్వెల్ తెరకెక్కుతుండగా... తాజాగా టీం నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది.
మేకింగ్ వీడియో రిలీజ్
దాదాపు మూడేళ్ల నుంచి షూటింగ్ జరుగుతుండగా... మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చాయి. వాటన్నింటినీ అధిగమించిన టీం ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వయంగా వెల్లడించారు. చిత్ర బృందం పడిన శ్రమను 'వరల్డ్ ఆఫ్ కాంతార' పేరిట రిలీజ్ చేశారు.
అసలు 'కాంతార చాప్టర్ 1' ఎలా ఉండబోతోంది?, సెట్స్ ఎలా ఉండబోతున్నాయి, దట్టమైన అడవిలో యాక్షన్ సీన్స్ అన్నింటినీ వీడియోలో చూపించారు. 'కాంతార'తో పోలిస్తే చాప్టర్ 1 సెట్స్, గ్రాండియర్ భారీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హీరో రిషబ్‌తో పాటు టెక్నికల్ టీం దాదాపు మూడేళ్ల పాటు పడ్డ శ్రమను కళ్లకు కట్టినట్లు వీడియోలో చూపించారు.
Also Read: రామ్ చరణ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా? - 'పెద్ది' కోసం ఊర మాస్ లుక్
మూడేళ్ల కఠోర శ్రమ... 250 డేస్ షూటింగ్
మన మట్టి కథను మొత్తం ప్రపంచానికి చెప్పాలనేదే తన కల అని రిషబ్ తెలిపారు. 'మన ఊరు... మన జనం... మన నమ్మకాలు. ఈ కథను చెప్పేందుకు అడుగు వేసినప్పుడు వేల మంది నా వెంట నడిచారు. మూడేళ్ల కఠోర శ్రమ. 250 రోజుల షూటింగ్. ఎంత కష్టం వచ్చినా నేను నమ్ముకున్న దైవం నా చేయి వదల్లేదు. ప్రతీ రోజూ సెట్‌లో వేల మందిని చూస్తున్నప్పుడు నన్ను వెంటాడుతున్న విషయం ఒక్కటే. ఇది కేవలం ఓ సినిమా కాదు. ఇది ఓ శక్తి. జర్నీ ఎండ్స్... బిగిన్స్.' అంటూ వీడియో చెప్పారు రిషబ్ శెట్టి.
భారీ యాక్షన్ సీన్స్, కత్తి యుద్ధాలు, భారీ సెట్స్ మూవీపై హైప్ పదింతలు చేశాయి. 'కాంతార'లో పుంజుర్లి దేవునికి సంబంధించి కొంత భాగం చూపించగా... చాప్టర్ 1లో ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి మొదలైందో దాని ముందు జరిగిన ఘటనలను చూపించనున్నారు. ఆ దేవునికి సంబంధించి పూర్తి వివరాలు ఇందులో చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
అక్టోబర్ 2న రిలీజ్
ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహిస్తుండగా... అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్, బెంగాళీలోనూ రిలీజ్ చేయనున్నారు.