యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమా నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. భారీ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. ఇది ఎన్నో అంచనాలు పెట్టుకున్న అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ తల్లి అమల తాజాగా దీనిపై స్పందించారు.

 

అక్కినేని అమల ఇన్స్టాగ్రామ్ వేదికగా 'ఏజెంట్' ట్రోలింగ్ పై రియాక్ట్ అయింది. "ట్రోలింగ్ అనేది లోతైన అభద్రత మరియు సాధించవలసిన అవసరం నుండి వస్తుందని నేను అర్థం చేసుకున్నాను. నేను నిన్న ఏజెంట్ సినిమా చూశాను. నిజాయితీగా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో కొన్ని లోపాలున్నప్పటికీ మీరు ఓపెన్ మైండ్ తో సినిమా చూస్తే ఆశ్చర్యపోతారు. నేను సినిమా చూసిన థియేటర్ జనంతో కిక్కిరిసిపోయింది. ప్రేక్షకులలో సగం మంది స్త్రీలు, తల్లులు, అమ్మమ్మలతో పాటు వారి భర్తలు, కొడుకులు ఉన్నారు. యాక్షన్ సీన్స్ కి కేకలు వేశారు. అఖిల్ నెక్స్ట్ మూవీ పెద్దగా బెటర్ గా ఉంటుందని నేను ఖచ్చితంగా చెబుతున్నాను" అని పోస్ట్ పెట్టారు. 

 

అమల తన పోస్ట్ కి టిమ్ హాన్సెన్ కొటేషన్ ని జత చేసింది. ఇందులో "క్రియేటివిటీ స్పెషల్ గా కనెక్షన్లను ఏర్పరచుకునే సామర్థ్యంలో ఎక్స్ ప్రెస్ చేయబడుతుంది. అనుబంధాలను ఏర్పరచాలంటే, చుట్టూ ఉన్న విషయాలను మార్చాలి. వాటిని కొత్త మార్గంలో ఎక్స్ ప్రెస్ చేయాలి" అనే పేర్కొనబడింది. 'ఏజెంట్' సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ, ఒక తల్లిగా అఖిల్ విషయంలో ఆమె గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తదుపరి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తోంది. 

 


 





నిజానికి అఖిల్ 'ఏజెంట్' సినిమా కోసం మూడేళ్ల పాటు చాలా కష్టపడ్డాడు. హార్డ్ వర్క్ చేసి కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేసి, పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఇక స్పై గా కనిపించడానికి తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఆతని కష్టమంతా తెర మీద కనిపిస్తుంది. రా ఏజెంట్ గా కనిపించి ఆకట్టుకున్న అఖిల్.. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. తన వరకూ వంద శాతం ఎఫర్ట్ పెట్టాడు. అయితే మిగతా క్రాఫ్ట్స్ లో లోపాల కారణంగా సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 



కాగా, "ఏజెంట్" సినిమాకు వక్కంతం వంశీ కథ అందించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. డియో మోరియా, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ, అజయ్, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. హిప్ హాప్ తమిజ సంగీతం సమకూర్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ స్పై మూవీ రూపొందింది.