Allu Arjun On Revanthi Death: 'పుష్ప 2' పెయిడ్ ప్రీమియర్ షోని అభిమానులతో కలిసి చూడడం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లారు. ఆయనను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి రావడంతో ఒకానొక దశలో తొక్కిసలాట జరిగింది. లాఠీ చార్జ్ చేసి మరి అభిమానులను పోలీసులు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో రేవతి అనే మహిళా అభిమాని మృతి చెందారు. ఆ ఘటన మీద అల్లు అర్జున్ స్పందించారు.
కుటుంబం బాధ్యత నాది... ఆవిడ లేని లోటు భర్తీ చేయలేను
పాతిక లక్షల సాయంతో పాటు మెడికల్ ఖర్చులు నేనే భరిస్తా!
''అందరికీ నమస్కారం మొన్న మేము 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వెళ్ళాను. అనుకోకుండా క్రౌడ్ ఎక్కువ అయింది. అక్కడికి ఒక ఫ్యామిలీ వచ్చిందని, వాళ్లకు దెబ్బలు తగిలాయని మాకు తెలిసింది. సినిమా చూసి వచ్చిన తర్వాత మర్నాడు ఉదయం మాకు తెలిసింది... దురదృష్టవశాత్తు రేవతి అనే అభిమాని మృతి చెందారు అని. ఆవిడకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని. ఆ విషయం తెలిసిన వెంటనే మేము అంతా చాలా డిజప్పాయింట్ అయ్యాం'' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
గత 20 ఏళ్లుగా ప్రతి సినిమాను అభిమానులతో కలిసి మెయిన్ థియేటర్లో చూడడం తనకు అలవాటు అని చెప్పిన అల్లు అర్జున్, గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎటువంటి ఘటన జరగలేదని, ఇప్పుడు జరిగిన ఘటన తనను ఎంతో బాధించిందని ఆయన తెలిపారు. అంతే కాదు... మృతి చెందిన మహిళ అభిమాని రేవతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయలను సాయంగా అందిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఆ పాతిక లక్షలు కాకుండా ప్రస్తుతం ఆ కుటుంబ వైద్య ఖర్చులు అంతా తాను భరిస్తానని, ఆ కుటుంబం బాధ్యత తనది అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. తాను ఏం చేసినా ఆ కుటుంబానికి రేవతి లేని లోటు భర్తీ చేయలేమని ఆయన బాధను వ్యక్తం చేశారు. తాను వాళ్లకు అండగా ఉన్నానని చెప్పడం కోసమే పాతిక లక్షలు ఇస్తున్నానని వాళ్లకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా తాను ఇస్తానని ఆయన తెలిపారు.
Also Read: అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
అభిమానుల కోసమే సినిమా తీస్తాను...
సినిమా చూశాక సురక్షితంగా ఇంటికి వెళ్ళండి!
మేమంతా సినిమాలు చేసేది అభిమానుల కోసమే అని అల్లు అర్జున్... సినిమాకు వచ్చిన ప్రతి అభిమాని సురక్షితంగా ఇంటికి వెళ్లాలని తాను కోరుకుంటానని ఆయన వివరించారు. అభిమాని మృతి చెందడంతో 'పుష్ప 2' సినిమా సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా తాము మానేశామని ఆయన తెలిపారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తమ ఎనర్జీ డౌన్ అవుతుందని, అభిమానులు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆయన రిక్వెస్ట్ చేశారు.
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?