'పుష్ప 2' (Pushpa 2 The Rule) పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయో... లేదో? సోషల్ మీడియాలో సినిమా మీద నెగెటివిటీ మొదలైంది. పని గట్టుకుని మరి కొంత మంది సినిమా మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. అందులో ముఖ్యమైనది... సినిమాలో డైలాగులు ఇవి అంటూ కొన్ని డైలాగులు చక్కర్లు కొడుతున్నాయి. మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఆ డైలాగ్స్ మీద రియాక్ట్ అయింది.
ఫేక్ పోస్టులు మానకపోతే లీగల్ యాక్షన్!
'పుష్ప 2' సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) ఇంట్రడక్షన్ ఫైటులో ఒక డైలాగ్ ఉంది. జపనీస్ ప్రజలు తమ బాస్ గురించి చెప్పినప్పుడు 'ఆ బాస్ కి కూడా నేనే బాస్' అని అల్లు అర్జున్ కౌంటర్ ఇస్తారు. దాన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా మార్చి రాశారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ... ఆ డైలాగ్ అల్లు అర్జున్ చెప్పారని కొంత మంది లేనిపోని ఆరోపణలు చేశారు. సినిమాకు సంబంధం లేని డైలాగులు పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యేలా చేశారు.
అలాగే మరొక సన్నివేశంలో అల్లు అర్జున్ 'ఏం పీకలేరు' అనే డైలాగ్ చెప్పారని, అది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారనే రీతిలో కొంత మంది ప్రచారం చేయడం మొదలు పెట్టారు. నిజానికి అటువంటి డైలాగ్ ఏది సినిమాలో అల్లు అర్జున్ చెప్పలేదు. కాకపోతే సినిమాలో ఆ డైలాగు ఉందని, నంద్యాల ఎపిసోడ్ లింక్ చేస్తూ ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ చెప్పారని ఫేక్ పోస్టులు క్రియేట్ చేశారు. ఇటువంటి పోస్టుల మీద మైత్రి మూవీ మేకర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
''ఊహాజనితమైన, సొంత క్రియేటివిటితో పుట్టించిన కొన్ని డైలాగులు 'పుష్ప 2' సినిమాలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ (కావాలని)గా కొంత మంది సినిమాపై నెగిటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం'' అని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఫేక్ పోస్టులు చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకుంటామని లీగల్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యామని చెప్పడం అంటే గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు లెక్క.
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?