రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ జంటగా కనిపించనున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ రోజు ఆలియా పుట్టినరోజు (Alia Bhatt Birthday). ఈ సందర్భంగా 'బ్రహ్మాస్త్ర'లో ఆమె ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు. ఇషా పాత్రలో ఆలియా భట్ కనిపించనున్నట్టు తెలిపారు.
ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు కదా! అలాగే, 'బ్రహ్మాస్త్ర'లో హీరో విజయం వెనుక ఉండే మహిళగా ఆలియా భట్ పాత్ర ఉంటుందని సమాచారం. ''మా ఇషా - 'బ్రహ్మాస్త్ర' యొక్క శక్తి" అంటూ ఆలియా భట్ క్యారెక్టర్ టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ పేర్కొన్నారు. (On the occasion of Alia Bhatt’s birthday, the team of BRAHMĀSTRA presents the first look of Alia as Isha!)
Also Read: మనం ఆ స్థాయి దాటేశాం, ప్రేక్షకులూ ప్రిపేర్ అయ్యారు! - ఎన్టీఆర్
'బ్రహ్మాస్త్ర'లో శివ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇందులో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు నష్టం రాకుండా, ప్రేక్షకులపై భారం పడకుండా! - రాజమౌళికి ఏపీ సీయం జగన్ హామీ