'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' (RRR Movie)... ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అందరి చూపు ఈ సినిమాపై ఉంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 24న సినిమా విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' కోసం ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, ఏపీలో ప్రజలు మాత్రం బెనిఫిట్ షోస్ గురించి ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఏపీలో సినిమా టికెట్ రేట్స్, షోస్ గురించి పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు కొత్త జీవో రావడంతో పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. పైగా, మంగళవారమే అమరావతి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని రాజమౌళి, దానయ్య కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీలో 'ఆర్ఆర్ఆర్' బెనిఫిట్ షోస్ ఉంటాయా? టికెట్ రేట్స్ పెరుగుతాయా? లేదా? అని ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది.
హైదరాబాద్‌లో మంగళవారం ప్రింట్, వెబ్ మీడియాతో హీరోలు ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) ఇద్దరితో కలిసి ముచ్చటించిన రాజమౌళి... ఏపీలో బెనిఫిట్ షోస్ గురించి స్పందించారు. "ఏపీ ప్రభుత్వం ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. దాని అర్థం ఏమిటి? ఒక షో ఎక్కువ. అది బెనిఫిట్ షోయే కదా. అన్ని రోజులూ బెనిఫిట్ షోస్ ఇచ్చినట్టు" అని రాజమౌళి వివరించారు. టికెట్ రేట్స్ గురించి ఆయన స్పందించలేదు. అలాగే, ముఖ్యమంత్రితో తాజా సమావేశం గురించి "జగన్ గారు క్లియర్ గా ఉన్నారు. ఒక జీవో పాస్ చేశాం. జీవో పద్దతిలో ఎలా జరుగుతుందో, అలా జరుగుతుంది. 'మీరు పెద్ద బడ్జెట్ పెట్టి కాస్ట్లీ సినిమా తీశారు. మీకు నష్టం రాకూడదని కోరుకుంటున్నాను' అని జగన్ గారు చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకులపై ఎక్కువ భారం పడకూడదన్నారు. మాకు నష్టం రాకుండా, ప్రేక్షకులకు భారం కాకుండా ఉంటుందని హామీ ఇచ్చారు" అని రాజమౌళి చెప్పారు.
Also Read: Ram Charan Helps Ukraine Security: ఉక్రెయిన్‌లో సెక్యూరిటీకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్' సినిమాకు టికెట్ మీద వంద రూపాయలు (RRR Movie Ticket Rates In Andhra Pradesh) పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే... ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు సినిమా సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం వంటివి ఉండవని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. సో... ఏపీలో 'ఆర్ఆర్ఆర్' బెనిఫిట్ షోస్ వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, టికెట్ రేట్స్ మాత్రం పెరిగే అవకాశాలు లేవని చెప్పాలి.